జిడ్డు చర్మానికి.. నేచురల్ ఫేస్ ప్యాక్స్..

ఆయిల్ స్కిన్ అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.. స్నానం చేసినా.. ముఖం వెంటనే జిడ్డుబారిపోతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇదొక పెద్ద ప్రాబ్లమ్. అయితే దీనికోసం కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటంటే.. ఆయిల్ స్కిన్ ను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్ వాష్ ల కన్నా.. సహజమైన క్లెన్సర్లను వాడడమే మేలు. నిమ్మరసం అన్నింటికంటే బెస్ట్ నేచురల్ క్లెన్సర్. ఇది చర్మంలో అదనపు జిడ్డను […]

Advertisement
Update:2021-02-09 12:18 IST

ఆయిల్ స్కిన్ అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.. స్నానం చేసినా.. ముఖం వెంటనే జిడ్డుబారిపోతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇదొక పెద్ద ప్రాబ్లమ్. అయితే దీనికోసం కొన్ని సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటంటే..

ఆయిల్ స్కిన్ ను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్ వాష్ ల కన్నా.. సహజమైన క్లెన్సర్లను వాడడమే మేలు. నిమ్మరసం అన్నింటికంటే బెస్ట్ నేచురల్ క్లెన్సర్. ఇది చర్మంలో అదనపు జిడ్డను తొలగిస్తుంది. నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. అయిల్ స్కిన్ సమస్య కొంతవరకూ తగ్గుతుంది.
ఆయిల్ స్కిన్ నుంచి విముక్తి కోసం.. సహజమైన ఫేస్ ప్యాక్ ను కూడా ట్రై చెయొచ్చు. టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ నిమ్మరసం, టీ స్పూన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపి ముఖానికి, మెడకు రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం పొడిగా కాంతివంతంగా మారడం వెంటనే గమనించొచ్చు.

అలాగే ఒక టీ స్పూన్‌ తేనెలో టీ స్పూన్‌ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడగినా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ స్కిన్ తో పాటు.. ముఖం మీద నల్లటి మచ్చలుంటే ప్రతిరోజూ క్యారెట్‌ జ్యూస్ ను అప్లై చేస్తుండాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో చర్మం కాంతిమంతమవుతుంది.

ఇవి కూడా..
– ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా ముఖం కడుక్కోవాలి. అయితే ముఖం చేతులతో గట్టిగా రుద్దకూడదు. చర్మాన్ని సున్నితంగా తాకాలి.
– ఫేస్‌‌‌‌వాష్‌లు వాడేటప్పుడు ఏది పడుతుందో ఏదో నెగటివ్ రిజల్ట్ ఇస్తుందో గమనించి వాడాలి.
– ఆయిల్‌‌‌‌ బేస్డ్‌‌‌‌, ఆల్కహాల్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ క్లెన్సర్స్‌‌‌‌ వాడకూడదు.
– బయటికి వెళ్లేటప్పుడల్లా సన్‌‌‌‌స్క్రీన్‌ లేదా మాయిశ్చరైజర్‌‌‌‌ రాసుకోవడం మర్చిపోవద్దు.
– ఏదైనా మేకప్ వేసుకోవాల్సి వస్తే.. వీలైనంత త్వరగా దాన్ని తీసివేసేలా జాగ్రత్త పడాలి. మేకప్ తో పడుకోవడం చర్మానికి అస్సలు మంచిది కాదు.

Tags:    
Advertisement

Similar News