మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..

ఈ మధ్య చాలామంది మ్యూచ్యువల్ ఫండ్స్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. బ్యాంక్ సేవింగ్స్, గోల్డ్, ఇన్సూరెన్స్ ఇలా అన్నింటితో పోల్చితే.. మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ అంటున్నారు. అయితే ఇందులో పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. అయితే ఇందలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. టార్గెట్ ముఖ్యం మ్యుచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎంత కాలం […]

Advertisement
Update:2021-01-30 08:34 IST

ఈ మధ్య చాలామంది మ్యూచ్యువల్ ఫండ్స్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారు. బ్యాంక్ సేవింగ్స్, గోల్డ్, ఇన్సూరెన్స్ ఇలా అన్నింటితో పోల్చితే.. మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ అంటున్నారు. అయితే ఇందులో పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే కొన్ని టిప్స్ గుర్తుంచుకోవాలి. అవేంటంటే..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. అయితే ఇందలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

టార్గెట్ ముఖ్యం
మ్యుచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎంత కాలం లేదా ఎంత డబ్బు అనేది ముందే ఫిక్స్ అవ్వాలి. పెరుగుతుంది కదా అని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ పోకూడదు. మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి కొద్దిపాటి అనాలసిస్ చేసి తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.

అడ్వైజర్ ఉంటే..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయదలచుకున్నప్పుడు ఒక అడ్వైజర్‌ను సంప్రదించడం బెస్ట్ ఆప్షన్. ఆర్థికంగా మీ లక్ష్యాలేంటి? దేనికోసం దాచాలనుకుంటున్నారు. ఎంత సమయం కేటాయించాలనుకుంటున్నారు. తదితర వివరాలన్నీ చెప్పి, అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో డెట్ ఫండ్స్‌, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌.. ఇలా రకాలుంటాయి. ఎలాంటి పాలసీ మంచిదో అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.

వేర్వేరుగా..
మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ ఉండాలి. అంటే ఒకే తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా.. రకరకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒకదాంట్లో లాభం రాకపోయినా మరో దాంట్లో వచ్చే అవకాశం ఉంది. నష్టపోయే అవకాశం తక్కువ ఉంటుంది.

రెండూ ఒకటి కాదు
చాలామంది మ్యూచ్యూవల్ ఫండ్స్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటే అనుకుంటారు. అవి రెండు ఒకే ప్లాట్‌ఫామ్ మీద పనిచేసినా అవి రెండూ ఒకటి. కాదు స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. మనమే సొంతగా మార్కెట్‌ను అంచనా వేసి ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఆ పని మనకోసం ఇంకొకరు చేస్తారు. ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది.

సహనం ఉండాలి
కొంతమంది మ్యూచ్యువల్ ఫండ్స్‌ను ఒక జూదంలా చూస్తారు. తక్కువ కాలంలోఎక్కువ డబ్బు రావాలని, ఒకేసారి జాక్‌పాట్ కొట్టాలని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాస్తవానికి మ్యూచ్యువల్ ఫండ్స్ అనేవి లాంగ్ టర్మ్ కోసం బాగుంటాయి. వీటి విషయంలో సహనంతో ఉంటేనే లాభం ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News