ఖైదీ గెటప్ లో నితిన్

నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం “చెక్”. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను ఈరోజు విడుదల చేశారు. “జైలులో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు” అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్, కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ […]

Advertisement
Update:2021-01-03 11:22 IST

నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న
చిత్రం “చెక్”. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులో హీరోయిన్లు. ఈ చిత్రానికి
సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను ఈరోజు విడుదల చేశారు.

“జైలులో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు” అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్, కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. ‘HE IS INNOCENT’ అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది.

40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది. అంతేకాదు, మూవీకి సంబంధించి చాలా విషయాల్ని వెల్లడించింది కూడా.

ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News