మరోసారి చిరంజీవి సరసన
లూసిఫర్ రీమేక్ కు సంబంధించి పనులు ఊపందుకున్నాయి. ఆమధ్య చిరంజీవి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్షీట్లు కూడా కేటాయించాడు మెగాస్టార్. దీంతో ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా లూసిఫర్ రీమేక్ లో నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ లేదు. కాకపోతే ఓ కీలక పాత్ర కోసం నయనతారను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మోహన్ […]
లూసిఫర్ రీమేక్ కు సంబంధించి పనులు ఊపందుకున్నాయి. ఆమధ్య చిరంజీవి ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్షీట్లు కూడా కేటాయించాడు మెగాస్టార్. దీంతో ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది.
ఇందులో భాగంగా లూసిఫర్ రీమేక్ లో నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ లేదు. కాకపోతే ఓ కీలక పాత్ర కోసం నయనతారను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా, నయనతారకు సత్సంబంధాలున్నాయి. ఆ పరిచయంతో మోహన్ రాజానే స్వయంగా నయనతారతో సంప్రదింపులు షురూ చేశాడు.
ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం నటుడు సత్యదేవ్ ను తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి సత్యదేవ్ ను తీసుకోమని స్వయంగా చిరంజీవి, దర్శకుడికి సూచించారట.