నిర్మలతో పనిచేయడం చాలా కష్టం " సుభాష్ చంద్ర గార్గ్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న ఏడాది తర్వాత అందుకు కారణాలను ఆయన వివరించారు. తన బ్లాగ్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. తాను రాజీనామా చేయడానికి … ఆర్థిక మంత్రితో సరైన సంబంధాలు లేకపోవడం కూడా కారణమేనని వ్యాఖ్యానించారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి నిర్మలకు సరైన అవగాహన ఉంది అంటూనే… ఆమెతో పనిచేయడం […]

Advertisement
Update:2020-10-31 14:58 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న ఏడాది తర్వాత అందుకు కారణాలను ఆయన వివరించారు. తన బ్లాగ్‌లో పలు అంశాలను ప్రస్తావించారు.

తాను రాజీనామా చేయడానికి … ఆర్థిక మంత్రితో సరైన సంబంధాలు లేకపోవడం కూడా కారణమేనని వ్యాఖ్యానించారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి నిర్మలకు సరైన అవగాహన ఉంది అంటూనే… ఆమెతో పనిచేయడం మాత్రం కష్టమని గార్గ్ తేల్చిచెప్పారు. నిర్మలా సీతారామన్‌తో తనకు కేరీర్ కలిసిరాలేదని వ్యాఖ్యానించారు.

అరుణ్‌జైట్లీతో కలిసి పనిచేయడం తనకు చాలా ఉత్తమంగా అనిపించిందని వివరించారు. నిర్మలా సీతారామన్‌కు తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు తాను గుర్తించానని గార్గ్ వెల్లడించారు. ఆర్బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ , పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన వైరుధ్యాలు ఏర్పడ్డాయని… చివరకు వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వివరించారు.

తన బదిలీకి నిర్మలా సీతారామన్ పట్టుపట్టారని… కానీ తాను ఆర్థికశాఖ లో కాకుండా మరొక చోట పనిచేయాలనుకోలేదని… అందుకే స్వచ్చంద పదవీ విరమణ చేసినట్టు వెల్లడించారు. స్వచ్చంద పదవీ విరమణ చేసిన తర్వాత ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోగలిగానని తన బ్లాగ్‌లో సుభాష్ చంద్ర గార్గ్ వివరించారు.

Advertisement

Similar News