కేసీఆర్ ను పెళ్లికి పిలిచిన నితిన్

నితిన్ పెళ్లికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌజ్ లో గుంభనంగా, ఓ 30 మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించాడు. ఈ మేరకు ఆ 30 మందికి ఆహ్వానాలు అందించారు. ఆ లిస్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు ప్రత్యేకంగా కలిశాడు నితిన్. ముఖ్యమంత్రికి స్వీట్స్ తో పాటు శుభలేఖ అందించి తన పెళ్లికి ఆహ్వానించాడు. లెక్కప్రకారం ఏప్రిల్ […]

Advertisement
Update:2020-07-20 15:24 IST

నితిన్ పెళ్లికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఓ ఫామ్ హౌజ్ లో గుంభనంగా, ఓ 30 మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించాడు. ఈ మేరకు ఆ 30 మందికి ఆహ్వానాలు అందించారు. ఆ లిస్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈరోజు ప్రత్యేకంగా కలిశాడు నితిన్. ముఖ్యమంత్రికి స్వీట్స్ తో పాటు శుభలేఖ అందించి తన పెళ్లికి ఆహ్వానించాడు.

లెక్కప్రకారం ఏప్రిల్ లోనే నితిన్ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ పడ్డంతో అన్నీ వాయిదాపడ్డాయి. కరోనా వల్ల ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనవనే విషయం నితిన్ కు అర్థమైంది. అందుకే ఈ నెల 26న రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు.

కేసీఆర్ కు నితిన్ శుభలేఖ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ పై పడింది. పవన్ కు డైహార్డ్ ఫ్యాన్ గా చెప్పుకునే నితిన్, తన అభిమాన హీరోకు ఎప్పుడు, ఎలా శుభలేఖ అందిస్తాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News