నాగబాబు ఎందుకలా చేశారు?
దాదాపు 4 రోజులుగా బాలయ్యపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నాగబాబు. ఇండస్ట్రీలో కొంతమంది భూములు పంచుకుంటున్నారంటూ ఎప్పుడైతే బాలయ్య నోరుజారారో.. ఆ మరుక్షణం నుంచి బాలయ్యపై నాగబాబు ఎటాక్ మొదలైంది. అలా ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బాలయ్యపై కామెంట్స్ చేస్తున్న నాగబాబు.. తాజాగా బాలకృష్ణ పాడిన పాటపై కూడా రియాక్ట్ అయ్యారు. సొంతంగా ఓ పాట పాడి అభిమానులకు పుట్టినరోజు కానుక అందించారు బాలయ్య. జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి అనే పాటను […]
దాదాపు 4 రోజులుగా బాలయ్యపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నాగబాబు. ఇండస్ట్రీలో కొంతమంది భూములు పంచుకుంటున్నారంటూ ఎప్పుడైతే బాలయ్య నోరుజారారో.. ఆ మరుక్షణం నుంచి బాలయ్యపై నాగబాబు ఎటాక్ మొదలైంది. అలా ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బాలయ్యపై కామెంట్స్ చేస్తున్న నాగబాబు.. తాజాగా బాలకృష్ణ పాడిన పాటపై కూడా రియాక్ట్ అయ్యారు.
సొంతంగా ఓ పాట పాడి అభిమానులకు పుట్టినరోజు కానుక అందించారు బాలయ్య. జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి అనే పాటను ఆలపించారు. బాలయ్య బాగానే కష్టపడ్డారు కానీ ఆ పాట మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒక్కముక్కలో చెప్పాలంటే శివశంకరి పాట ఔన్నత్యాన్ని దెబ్బతీశారు బాలయ్య. ఆ గొంతు అయితే కర్ణకఠోరంగా ఉంది.
దీనిపై నాగబాబు స్పందించారు. కరోనా కంటే ప్రమాదకరమైన సంగీతం ఒకటి సర్కులేట్ అవుతోందని.. అంతా జాగ్రత్తగా ఉండాలని నాగబాబు వెటకారం చేశారు. చిన్నపిల్లల్ని, ఆరోగ్యం బాగాలేని వాళ్లను సంగీతం వినకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కామెడీగా హెచ్చరించారు. బాలయ్య పాడిన పాటను ఉద్దేశించి పరోక్షంగా ఈ కామెంట్స్ చేశారు నాగబాబు.
అయితే ఇంత సెటైరిక్ గా ట్వీట్ పెట్టిన నాగబాబు.. కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను తొలిగించడం చర్చనీయాంశమైంది. నాగబాబు భయపడ్డారంటూ కొందరు వాదిస్తే, పుట్టినరోజు బాలయ్యను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక నాగబాబు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారని మరికొందరు సమర్థించారు.