కొత్త ప్లాన్ గీసిన అల్లు అర్జున్

లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని యూనిట్స్ అన్నీ భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో పుష్ప యూనిట్ మాత్రం తొందరపడడం లేదు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ కేరళలో పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు. అయితే పర్మిషన్ వచ్చిన వెంటనే ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయడం లేదు. ప్రభుత్వం […]

Advertisement
Update:2020-06-02 06:30 IST

లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన వెంటనే సెట్స్ పైకి వెళ్లిపోవాలని యూనిట్స్ అన్నీ భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో పుష్ప యూనిట్ మాత్రం తొందరపడడం లేదు.

అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ కేరళలో పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు.

అయితే పర్మిషన్ వచ్చిన వెంటనే ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయడం లేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ వీళ్లు మరో 2 నెలలు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారు. కరోనా పరిస్థితులు, భయాందోళనలు అన్నీ సద్దుమణిగిన తర్వాత ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లాలని యూనిట్ భావిస్తోంది. అప్పటికి కరోనాకు వాక్సిన్ కూడా వచ్చేస్తుందనేది వీళ్ల గట్టి నమ్మకం.

పైగా ఆగస్ట్ లో కూడా కట్టుదిట్టమైన నిబంధనలు మధ్య షూట్ చేయాలని నిర్ణయించారు. సగం యూనిట్ తోనే షూట్ చేయడంతో పాటు.. ఆ యూనిట్ మొత్తాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ముందే కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తారు. నెగెటివ్ వచ్చిన వాళ్లనే తీసుకుంటారు. ఆ తర్వాత కూడా యూనిట్ సభ్యులెవర్నీ బయట వ్యక్తులతో కలవనీయరు. ఏకంగా ఓ కాలనీ లాంటిది ఏర్పాటుచేసి, కేవలం యూనిట్ కు మాత్రమే ప్రవేశం ఉండేలా ప్లాన్ చేసి భారీ షెడ్యూల్ పూర్తిచేయాలని చూస్తున్నారు. ప్రాక్టికల్ గా ఇవన్నీ ఏ మేరకు అమలవుతాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News