విశాఖలో పెనుప్రమాదం... ఐదు కి.మీ. మేర విషవాయువు... కుప్పకూలిపోతున్న ప్రజలు
విశాఖలో పెను ప్రమాదం జరిగింది. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు లీక్ అయింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర విషవాయువు ఆవరించింది. తెల్లవారుజామున విషవాయువు లీక్ అవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విషవాయువు ప్రభావంతో మనుషులు ఎక్కడిక్కడ కుప్పకూలిపడిపోతున్నారు. ఇప్పటికే నలుగురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 80 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కొన్ని దృశ్యాలు మనసును కదిలించివేస్తున్నాయి. వీధుల్లో మనుషులు పిట్టల్లా పడి ఉన్నారు. పెద్ద […]
విశాఖలో పెను ప్రమాదం జరిగింది. ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువు లీక్ అయింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర విషవాయువు ఆవరించింది. తెల్లవారుజామున విషవాయువు లీక్ అవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విషవాయువు ప్రభావంతో మనుషులు ఎక్కడిక్కడ కుప్పకూలిపడిపోతున్నారు. ఇప్పటికే నలుగురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 80 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
కొన్ని దృశ్యాలు మనసును కదిలించివేస్తున్నాయి. వీధుల్లో మనుషులు పిట్టల్లా పడి ఉన్నారు. పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. పెంపుడు జంతువులు గిలగిల కొట్టుకుంటున్న దృశ్యాలు భీతికల్పిస్తున్నాయి. పక్షులు చెట్ల మీద నుంచి కింద పడిచనిపోయాయి.
గోపాలపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. భారీగా వాయువు లీక్ అవడంతో ప్రజలు అల్లాడిపోయారు. చిన్నారులు చాలా మంది వాయువు ప్రభావానికి లోనయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వందలాది మందిని ఆస్పత్రులకు తరలించారు. చుట్టుపక్కల ఐదు గ్రామాలను ఖాళీ చేయించారు. విషవాయువు లీక్ అవుతోందని తెలుసుకున్న ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. కొందరు అలా పరుగులు తీస్తూనే వీధుల్లో సొమ్మసిల్లిపడిపోయారు.
The children and the old worst affected in vizag has tragedy
Publiée par Lokesh Paila sur Mercredi 6 mai 2020