అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటా!
తన పాత్రల విషయంలో సాయిపల్లవి చాలా క్లియర్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా తన కెరీర్ పై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్, కోట్ల రూపాయల పారితోషికం తనకు అక్కర్లేదంటోంది సాయిపల్లవి. తనకు మంచి పాత్ర దొరికితే చాలంటోంది. మరీ ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో ఈమె చాలా నిక్కచ్చిగా ఉంటోంది. “షార్ట్ గౌన్స్ వేసుకోవడానికి నేను వ్యతిరేకం. అలాంటి గ్లామర్ నాకు అవసరం లేదు. ఇన్నర్ బ్యూటీని చూసే పాత్రలు నాకు కావాలి. […]
తన పాత్రల విషయంలో సాయిపల్లవి చాలా క్లియర్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా తన కెరీర్ పై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. గ్లామర్ హీరోయిన్ ఇమేజ్, కోట్ల రూపాయల పారితోషికం తనకు అక్కర్లేదంటోంది సాయిపల్లవి. తనకు మంచి పాత్ర దొరికితే చాలంటోంది. మరీ ముఖ్యంగా డ్రెస్సింగ్ విషయంలో ఈమె చాలా నిక్కచ్చిగా ఉంటోంది.
“షార్ట్ గౌన్స్ వేసుకోవడానికి నేను వ్యతిరేకం. అలాంటి గ్లామర్ నాకు అవసరం లేదు. ఇన్నర్ బ్యూటీని చూసే పాత్రలు నాకు కావాలి. ఫిదా సినిమాలో నేను అలానే కనిపించాను. అయితే ఒకే ఒక్క సీన్ లో మాత్రం డిమాండ్ మేరకు పొట్టి దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది.”
ఫిదాలో కనిపించినట్టు మిగతా అన్ని సినిమాల్లో అలానే పొట్టి దుస్తుల్లో కనిపించాలంటే మాత్రం ఒప్పుకోనంటోంది సాయిపల్లవి. అవసరమైతే ఆ సినిమాను వదులుకుంటానని చెబుతోంది. ఇప్పటికే అలాంటి గ్లామర్ పాత్రల్ని లెక్కలేనన్ని వదులుకున్నానని, తనకు అలాంటి గ్లామర్ హీరోయిన్ ఇమేజ్ అక్కర్లేదని ఓపెన్ గా చెబుతోంది సాయిపల్లవి.