ఆమెకు 42... అతనికి 32... ఓ క్రైమ్‌ కథ !

కేరళలోని పాలక్కడ్‌లో ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. బ్యూటిషియన్‌ సుచిత్ర దారుణ హత్యకు గురైంది. కొల్లామ్‌ జిల్లాకు చెందిన ఆమె వయస్సు 42 సంవత్సరాలు. బ్యూటిషియన్‌. మార్చి 17 న తన మావయ్యకు ఒంట్లో బాగోలేదని…. తాను వెంటనే అలప్పుజాకు వెళ్లాలని సెలవు కోసం తన కంపెనీకి మెయిల్ చేసింది. లీవ్‌ దొరకవడంతో ఇంటికి వెళ్లింది. ఆతర్వాత మరో ఐదు రోజులు కావాలని మెయిల్‌ చేసింది. అటు ఇంట్లో వాళ్లకి ఆఫీసు పని మీద ఎర్నాకుళం వెళుతున్నానని […]

Advertisement
Update:2020-05-01 02:30 IST

కేరళలోని పాలక్కడ్‌లో ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. బ్యూటిషియన్‌ సుచిత్ర దారుణ హత్యకు గురైంది. కొల్లామ్‌ జిల్లాకు చెందిన ఆమె వయస్సు 42 సంవత్సరాలు. బ్యూటిషియన్‌. మార్చి 17 న తన మావయ్యకు ఒంట్లో బాగోలేదని…. తాను వెంటనే అలప్పుజాకు వెళ్లాలని సెలవు కోసం తన కంపెనీకి మెయిల్ చేసింది. లీవ్‌ దొరకవడంతో ఇంటికి వెళ్లింది. ఆతర్వాత మరో ఐదు రోజులు కావాలని మెయిల్‌ చేసింది. అటు ఇంట్లో వాళ్లకి ఆఫీసు పని మీద ఎర్నాకుళం వెళుతున్నానని చెప్పింది.

మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ మొదలైంది. ఎర్నాకుళం వెళ్లిన సుచిత్ర ఇంటికి రాలేదు. దీంతో ఆమె పనిచేస్తున్న కంపెనీలో కుటుంబ సభ్యులు వాకబు చేశారు. ఐదు రోజుల సెలవు తీసుకుందని తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుచిత్ర భర్తతో విడాకులు తీసుకుంది. ఈ మధ్య సోషల్‌ మీడియాలో పరిచయమైన అబ్బాయితో చనువుగా ఉంటుందని పోలీసులకు చెప్పారు. ఈ క్లూతో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడింది.

మనాలీకి చెందిన కీ బోర్డు ప్లేయర్ ప్రశాంత్ (32) సోషల్ మీడియా ద్వారా సుచిత్రకు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు పోలీసులు గమనించారు. సుచిత్ర… ప్రశాంత్ ను కలవటానికి మనాలీ వెళ్లి ఉంటుదని అంచనా వేశారు. వెంటనే కొల్లాయం క్రైమ్ బ్రాంచి పోలీసులు మనాలీ వెళ్లి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

అయితే తనను పెళ్లి చేసుకోవాలని గొడవ చేసిందని….ఆతర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రశాంత్‌ చెప్పుకొచ్చాడు. కానీ పోలీసులు తమ స్టైల్ లో అడిగేసరికి… తానే సుచిత్రను చంపినట్లు…తాను రెంట్‌ ఉంటున్న ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… అతన్ని అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News