కరోనా ప్రభావం... మెరిసిన ఫ్లాప్ సినిమా

ఈ లాక్ డౌన్ కారణంగా బుల్లితెరకు మహర్దశ పట్టింది. అంతా ఇళ్లకే పరిమితమవ్వడం, ఆఫీసులు కూడా లేకపోవడంతో తప్పనిసరిగా వినోదం కోసం టీవీ ఒక్కటే మార్గంగా మారింది. దీంతో గడిచిన 3-4 వారాలుగా దాదాపు అన్ని ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఓవైపు రెవెన్యూ పూర్తిస్థాయిలో పడిపోయినా, ఈ రేటింగ్ చూసి సంబరపడుతున్నాయి ఛానెల్స్. తాజాగా జాను సినిమా బుల్లితెరపై మెరిసింది. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితేనేం లాక్ […]

Advertisement
Update:2020-04-25 00:32 IST

ఈ లాక్ డౌన్ కారణంగా బుల్లితెరకు మహర్దశ పట్టింది. అంతా ఇళ్లకే పరిమితమవ్వడం, ఆఫీసులు కూడా లేకపోవడంతో తప్పనిసరిగా వినోదం కోసం టీవీ ఒక్కటే మార్గంగా మారింది. దీంతో గడిచిన 3-4 వారాలుగా దాదాపు అన్ని ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఓవైపు రెవెన్యూ పూర్తిస్థాయిలో పడిపోయినా, ఈ రేటింగ్ చూసి సంబరపడుతున్నాయి ఛానెల్స్.

తాజాగా జాను సినిమా బుల్లితెరపై మెరిసింది. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితేనేం లాక్ డౌన్ కారణంగా బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్టయింది. కొత్త సినిమా కావడంతో అంతా ఈ సినిమానే చూశారు. ఫలితంగా జాను సినిమాకు ఏకంగా 9.61 రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకు ఈ స్థాయిలో రేటింగ్ రావడం పెద్ద విషయమే.

తమిళ్ లో హిట్టయిన 96 సినిమాకు రీమేక్ గా దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో నిర్మించాడు. కచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకంతో శర్వానంద్, సమంత లాంటి స్టార్స్ ను ఇందులోకి లాగాడు. కానీ జాను మాత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

Tags:    
Advertisement

Similar News