నా మద్దతు జనసేనకే... పవన్ కు కాదు... చిరంజీవి హాట్ కామెంట్స్

మెగా స్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని పెట్టి పోరాడి రాజకీయ దెబ్బలకు కుదేలై.. చివరకు రాజకీయాలంటేనే వెగటు పుట్టి వదిలేసి…. ఇప్పుడు సుబ్బరంగా సినిమాలు చేసుకుంటున్నాడు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకోవడం లేదు. అయితే అతడి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో ఉన్నాడు. అయితే తమ్ముడు రాజకీయ ప్రయాణంపై చిరంజీవికి ఎలాంటి అభిప్రాయం ఉందనే సంగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపడింది. చిరంజీవి మాట్లాడుతూ.. ‘పవన్ దారి, నా దారి వేరు. కానీ మా […]

Advertisement
Update:2020-04-23 11:30 IST

మెగా స్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని పెట్టి పోరాడి రాజకీయ దెబ్బలకు కుదేలై.. చివరకు రాజకీయాలంటేనే వెగటు పుట్టి వదిలేసి…. ఇప్పుడు సుబ్బరంగా సినిమాలు చేసుకుంటున్నాడు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకోవడం లేదు.

అయితే అతడి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో ఉన్నాడు. అయితే తమ్ముడు రాజకీయ ప్రయాణంపై చిరంజీవికి ఎలాంటి అభిప్రాయం ఉందనే సంగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపడింది.

చిరంజీవి మాట్లాడుతూ.. ‘పవన్ దారి, నా దారి వేరు. కానీ మా బంధం మాత్రం ఒకటే. పవన్ కు రాజకీయ సలహాలు ఇవ్వడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించను. అలాగే పవన్ కూడా నా వద్ద పాలిటిక్స్ తీయడు’ అని బదులిచ్చాడు.

మా తల్లిని చూడడానికి మా ఇంటికి అప్పుడప్పుడు వస్తాడు. ఆ రాత్రి మాతో కలిసి భోజనం చేస్తాడు. రాజకీయాల గురించి నేను ఎప్పుడూ అడగనని… పవన్ కూడా చెప్పడని చిరంజీవి తెలిపాడు.

ఇక తన మద్దతు జనసేనకు ఉంటుందని.. కానీ రాజకీయాల్లో ఉన్న పవన్ కు ఉండదని చిరంజీవి స్పష్టం చేశాడు. పవన్ కుటుంబ సభ్యులుగా తాము అతడికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని.. కానీ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న అతడి నిర్ణయాన్ని మాత్రం తాము అతడికే వదిలేశామని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తనకు పీఆర్పీ గుణపాఠం కలిగాక ఈ విషయం బోధపడిందన్నారు. అయితే ఏదో ఒకరోజు పవన్ కోరుకున్నది సాధిస్తాడనే నమ్మకం తనకు ఉందన్నాడు.

Tags:    
Advertisement

Similar News