శింబు నాకు ఫ్రెండ్ మాత్రమే
హీరోయిన్ హన్సిక, హీరో శింబు మధ్య ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. తమ ప్రేమ-పెళ్లి విషయాన్ని హీరోహీరోయిన్ ఇద్దరూ అప్పట్లో ఘనంగా ఎనౌన్స్ చేశారు కూడా. కానీ కుటుంబాల మధ్య పొసగక వీళ్లిద్దరి బంధం ప్రేమతోనే ఆగిపోయింది. అలా శింబుకు దూరమైన హన్సిక.. చాన్నాళ్ల పాటు అతడితో సంబంధబాంధవ్యాలు తెంచుకుంది. ఈమధ్యే మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం కలిసి సినిమా కూడా చేస్తున్నారు. ఈ […]
హీరోయిన్ హన్సిక, హీరో శింబు మధ్య ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరూ దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. తమ ప్రేమ-పెళ్లి విషయాన్ని హీరోహీరోయిన్ ఇద్దరూ అప్పట్లో ఘనంగా ఎనౌన్స్ చేశారు కూడా. కానీ కుటుంబాల మధ్య పొసగక వీళ్లిద్దరి బంధం ప్రేమతోనే ఆగిపోయింది.
అలా శింబుకు దూరమైన హన్సిక.. చాన్నాళ్ల పాటు అతడితో సంబంధబాంధవ్యాలు తెంచుకుంది. ఈమధ్యే మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రస్తుతం కలిసి సినిమా కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హన్సిక మరోసారి శింబుకు దగ్గరైందంటూ పుకార్లు వస్తున్నాయి. వీటిని హన్సిక ఖండించింది.
ప్రస్తుతం శింబు తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటోంది ఈ ఆపిల్ పిల్ల. ప్రేమించి విడిపోయిన తర్వాత స్నేహితులుగా కొనసాగకూడదా అంటూ ప్రశ్నిస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో తన అభిమానులతో ముచ్చటించిన హన్సిక, ఈ విషయాన్ని బయటపెట్టింది. శింబు ఎప్పటికీ తనకు మంచి స్నేహితుడే అంటోంది.