ఈ సినిమాలు చెల్లాచెదురయ్యాయి

ఎన్నోసార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది నిశ్శబ్దం. మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ‘ఉప్పెన’ కూడా సిద్ధమైంది. అటు చాలా కష్టపడి రానా చేసి ‘అరణ్య్’ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబైంది. వీటితో పాటు రామ్ ‘రెడ్’ కూడా రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలన్నీ ఇప్పుడు చెల్లాచెదురయ్యాయి. అవును.. కరోనా వల్ల మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన V, ఒరేయ్ బుజ్జిగా, […]

Advertisement
Update:2020-03-15 12:30 IST

ఎన్నోసార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది నిశ్శబ్దం. మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమౌతున్న ‘ఉప్పెన’ కూడా సిద్ధమైంది. అటు చాలా కష్టపడి రానా చేసి ‘అరణ్య్’ కూడా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబైంది. వీటితో పాటు రామ్ ‘రెడ్’ కూడా రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. ఏప్రిల్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలన్నీ ఇప్పుడు చెల్లాచెదురయ్యాయి.

అవును.. కరోనా వల్ల మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన V, ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు ఏప్రిల్ కు వాయిదా పడ్డాయి. ఇవి ఏప్రిల్ కు వచ్చాయి కాబట్టి.. అనుష్క, వైష్ణవ్ తేజ్, రానా సినిమాలు అనివార్యంగా వాయిదా పడాల్సిందే. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2న రావాల్సిన ఉప్పెన, నిశ్శబ్దం, అరణ్య సినిమాలు వచ్చే అవకాశం లేదు. ఆ టైమ్ కు V వచ్చే అవకాశం ఉంది.

చిన్న సినిమా అయినప్పటికీ ఈ లిస్ట్ లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఈ సినిమాను గీతాఆర్ట్స్, యూవీ కలిసి రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి. మార్కెట్లో సినిమాలు లేవు కాబట్టి, తమ థియేటర్లు అనివార్యంగా ఖాళీ అవుతున్నాయి కాబట్టి ప్రదీప్ నటించిన ఈ సినిమాను యూవీ-గీతా తీసుకున్నాయి. కానీ సినిమాలన్నీ వాయిదాపడ్డంతో.. రాబోయే రోజుల్లో థియేటర్ల కోసం యూవీ-గీతాపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ప్రదీప్ సినిమాకు ఆటోమేటిగ్గా అన్యాయం జరుగుతుంది. కరోనా ఇలా పలు రకాలుగా దెబ్బ తీస్తోంది.

Tags:    
Advertisement

Similar News