రెమ్యూనరేషన్ వెనక్కిచ్చిన విజయ్ దేవరకొండ?

‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించాడు. ఈ మూవీ హిట్టుతో యువతలో విజయ్ దేవరకొండకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ‘గీత గోవిందం’ సక్సెస్ తో స్టార్ హీరోగా మారాడు. ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకొంది. దీంతో ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసింది. […]

Advertisement
Update:2020-02-24 08:46 IST

‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సంచలనం సృష్టించాడు. ఈ మూవీ హిట్టుతో యువతలో విజయ్ దేవరకొండకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ‘గీత గోవిందం’ సక్సెస్ తో స్టార్ హీరోగా మారాడు.

ఇటీవల ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకొంది. దీంతో ఈ మూవీ భారీ నష్టాలను చవిచూసింది. దాదాపు 20కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో విజయ్ దేవరకొండ ఈ మూవీ నష్టాలను కవర్ చేసేందుకు తన రెమ్యూనరేషన్ లో కొంతభాగం వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదలైంది. తొలిరోజు 9కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ లపై ప్రభావం చూపింది. అంతేకాకుండా ఇటీవల నితిన్ నటించిన ‘భీష్మ’ మూవీ భారీ విజయం దిశగా దూసుకెళుతుంది. ఈ చిత్రవిజయం ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై ప్రభావం చూపింది. ఇప్పటికే పలు థియేటర్లలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తీసేసి ‘భీష్మ’ మూవీని ప్రదర్శిస్తున్నారు. నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ చేసిన రోమాన్స్ ఈ చిత్రానికి ఏమాత్రం హెల్ప్ కాలేదు. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ తాజా చిత్రాలపై ప్రభావం చూపుతోంది.

విజయ్ దేవరకొండ స్టార్డమ్ ఈ మూవీని గట్టెక్కించలేకపోయింది. ఈ మూవీ కె.ఎస్.రామారావుకు భారీ నష్టాలను కలిగించింది. దీంతో ఆయన నుంచి భారీ రేట్లకు సినిమాను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవాల్సి వచ్చింది. వీరంతా తమకు తిరిగి డబ్బులు చెల్లించాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నారు. ఈమేరకు ఆయన రానున్న మూవీతో నష్టాన్ని కవర్ చేస్తానని చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో కొంతమేరకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు.

హీరోకు సినిమా కలెక్షన్లు, నష్టాలతో సంబంధం లేకున్నప్పటికీ ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు కొంతమేరకు నిర్మాత నష్టాల్లో భాగస్వాములు అవుతూ వస్తున్నాయి. వారిబాటలోనే విజయ్ దేవరకొండ కూడా తన రెమ్యూనరేషన్ లో సగం నిర్మాతకు వెనక్కి ఇచ్చినట్లు తెల్సింది. అయితే భారీ మొత్తంలో వచ్చిన నష్టాన్ని నిర్మాత ఎలా పూరిస్తాడో వేచి చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News