షాకింగ్: బెల్లంకొండ చిత్రంకంటే వెనుకబడ్డ పవన్ సినిమా?

టాలీవుడ్ లో విజయవంతమైన అగ్ర నిర్మాత దిల్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను పవన్ హీరోగా టాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని కమర్షియల్ హంగులను, వాణిజ్య విలువలను జోడించి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా రూపొందిస్తున్నారట.. ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా హిందీ యూట్యూబ్ హక్కుల కోసం […]

Advertisement
Update:2020-02-22 15:35 IST

టాలీవుడ్ లో విజయవంతమైన అగ్ర నిర్మాత దిల్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.. హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను పవన్ హీరోగా టాలీవుడ్ లో రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని కమర్షియల్ హంగులను, వాణిజ్య విలువలను జోడించి పవన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా రూపొందిస్తున్నారట..

ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా హిందీ యూట్యూబ్ హక్కుల కోసం ఒకరు రూ.5 కోట్ల ఆఫర్ ఇచ్చారట. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే విషయంగా మారింది. నిజానికి పవన్ ‘పింక్’ రిమేక్ సినిమా హిందీలో ఆల్ రెడీ హిట్ అయ్యింది. దీన్ని మళ్లీ హిందీలోకి డబ్ చేస్తే ఎవరూ చూడరు. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా హిందీ రైట్స్ కు డిమాండ్ ఏర్పడిందట..

ఇప్పటికే తెలుగులో సాధారణంగా ఆడిన సినిమాలు కూడా హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదలైతే వందల మిలియన్ల వ్యూస్ సంపాదించాయి. తెలుగులో ఫ్లాప్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు కూడా 10 కోట్లకు పైగా అమ్ముడుపోవడం విశేషం. అయితే పవన్ రీఎంట్రీ మూవీకి కేవలం 5 కోట్ల డిమాండ్ రావడంపై ఆయన అభిమానులు నిరాశపడుతున్నారు. పవన్ మార్కెట్ పరిస్థితిపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పవన్ రీఎంట్రీ మూవీని ఆల్ రెడీ చాలా మంది చూడడంతో దానికి హైప్ రావడం లేదని అందరూ అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది.

Tags:    
Advertisement

Similar News