కరోనా విలయంలో.... 76 కోట్ల మంది?

కరోనా వైరస్ ప్రభావం.. రోజురోజుకూ విస్తరిస్తోంది. చైనాలో పుట్టి.. చైనానే అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి విలయంలో ఆ దేశానికి చెందిన 76 కోట్ల మంది చిక్కుకుని విలవిలలాడుతుండడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. వైరస్ ప్రభావానికి గురై వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తుండగా.. వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రభావం మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు… ఆ దేశం కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ప్రజలు అత్యవసరాల కోసం అయితే తప్ప […]

Advertisement
Update:2020-02-18 05:08 IST

కరోనా వైరస్ ప్రభావం.. రోజురోజుకూ విస్తరిస్తోంది. చైనాలో పుట్టి.. చైనానే అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి విలయంలో ఆ దేశానికి చెందిన 76 కోట్ల మంది చిక్కుకుని విలవిలలాడుతుండడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది.

వైరస్ ప్రభావానికి గురై వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడుస్తుండగా.. వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రభావం మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు… ఆ దేశం కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ప్రజలు అత్యవసరాల కోసం అయితే తప్ప బయటికి రాకుండా నిబంధనలు విధించింది.

కరోనా ప్రభావం అధికంగా ఉన్న వుహాన్ తో పాటు.. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ ఆంక్షలను అమలు చేస్తోంది. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా.. ఉన్నతాధికారులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా.. ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఆంక్షల కారణంగా నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఎన్నడూ కనీ.. వినీ ఎరుగనట్టు దొంగతనాలు జరుగుతున్నాయి. టాయిలెట్ పేపర్లు, డైపర్లనూ దోచుకెళ్తున్నారు. హాంకాంగ్ లో జరిగిన ఈ ఘటన.. అక్కడి అత్యవసర పరిస్థితికి అద్దం పడుతోంది.

ఇక.. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా.. 76 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది.. ఆ దేశ జనాభాలో సగానికి సమానం. వీరందరూ అనుక్షణం ఏం చేస్తున్నారన్నదానిపై చైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. స్థానిక కమిటీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. అధికారులకు, ప్రజలకు.. ఈ కమిటీ పరిపాలనలో వారధిగా పని చేస్తుంటాయి. మరోవైపు.. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండులు, విమానాశ్రయాల్లో నిఘాను పటిష్టం చేసింది. శరీర ఉష్ణోగ్రతలు పసిగట్టే యంత్రాలతో ప్రయాణికులందరినీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

మొత్తంగా చెప్పాలంటే.. కరోనాను ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News