ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ వివరణ

మరోసారి నెగెటివ్ అంశాలతో వార్తల్లోకెక్కాడు యాంకర్ ప్రదీప్. ఇతడు 2 రోజులు జైల్లో ఉన్నాడంటూ కీసరకు చెందిన ఓ చిన్న దర్శకుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడతను. ఈ మొత్తం వ్యవహారంపై ప్రదీప్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు. తను 2 రోజులు జైలుశిక్ష అనుభవించాననే విషయంలో ఎలాంటి నిజం లేదంటున్నాడు ప్రదీప్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కౌన్సిలింగ్ తీసుకోవడం వరకు నిజమని, తను […]

Advertisement
Update:2020-02-04 05:40 IST

మరోసారి నెగెటివ్ అంశాలతో వార్తల్లోకెక్కాడు యాంకర్ ప్రదీప్. ఇతడు 2 రోజులు జైల్లో ఉన్నాడంటూ కీసరకు చెందిన ఓ చిన్న దర్శకుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడతను. ఈ మొత్తం వ్యవహారంపై ప్రదీప్ స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు.

తను 2 రోజులు జైలుశిక్ష అనుభవించాననే విషయంలో ఎలాంటి నిజం లేదంటున్నాడు ప్రదీప్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కౌన్సిలింగ్ తీసుకోవడం వరకు నిజమని, తను ఓ అమ్మాయిని వేధించాననే ఆరోపణల్లో మాత్రం ఎలాంటి నిజం లేదంటున్నాడు. 2 రోజులు జైలుశిక్ష అనుభవించాననే విషయంలో అస్సలు నిజం లేదంటున్నాడు.

ప్రదీప్ ఈమధ్య హీరోగా మారాడు. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేస్తున్నాడు.
సెంట్రల్ ఫిలిం బోర్డ్ నిబంధనల ప్రకారం జైలుశిక్ష అనుభవించిన వ్యక్తికి హీరోగా నటించే అర్హత ఉండదంటున్నాడు కేసు పెట్టిన దర్శకుడు.

అయితే తనపై కేసు పెట్టిన దర్శకుడు ఎవరో తనకు తెలియదని, అతడి పేరు కూడా తను వినలేదని అంటున్నాడు ప్రదీప్. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News