యాక్షన్ మోడ్ లోకి మారిన నాగశౌర్య

అప్పుడెప్పుడో జాదూగాడు అనే సినిమాలో యాక్షన్-మాస్ ట్రై చేశాడు నాగశౌర్య. ఆ సినిమా దెబ్బకు మళ్లీ అటువైపు చూడడం మానేశాడు. సాఫ్ట్ స్టోరీలు, ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు. అశ్వథ్థామ సినిమా కూడా అలాంటిదే అనుకున్నారంతా. కానీ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే అర్థమౌతోంది. అవును.. అశ్వథ్థామ టీజర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. ఇదేదో నాగశౌర్యను హీరోగా ఎలివేట్ చేయడం కోసం […]

Advertisement
Update:2019-12-27 13:57 IST

అప్పుడెప్పుడో జాదూగాడు అనే సినిమాలో యాక్షన్-మాస్ ట్రై చేశాడు నాగశౌర్య. ఆ సినిమా దెబ్బకు మళ్లీ అటువైపు చూడడం మానేశాడు. సాఫ్ట్ స్టోరీలు, ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు. అశ్వథ్థామ సినిమా కూడా అలాంటిదే అనుకున్నారంతా. కానీ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే అర్థమౌతోంది.

అవును.. అశ్వథ్థామ టీజర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. ఇదేదో నాగశౌర్యను హీరోగా ఎలివేట్ చేయడం కోసం ప్రయత్నం కాదు. సినిమానే యాక్షన్ జానర్. అంతేకాదు, ఈ సినిమాకు స్వయంగా నాగశౌర్య కథ రాసుకున్నాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాడు శౌర్య. దర్శకుడు రమణ తేజ ఈ కథను గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు.

ఇవన్నీ ఒకెత్తయితే.. టీజర్ కు సంబంధించి 2 విషయాల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీజర్ లో శ్రీచరణ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇక మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచింది. టీజర్ లాస్ట్ షాట్ లో అతడి కెమెరా పనితనం కనిపిస్తుంది. నాగశౌర్య తీవ్రంగా గాయపడింది ఈ సీన్ తీస్తున్నప్పుడే.

Tags:    
Advertisement

Similar News