చంద్రబాబు క్షమాపణ చెప్పాలి " విశాఖ టీడీపీ అధ్యక్షుడు రాజీనామా
విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముందు రాజధాని ప్రాంత ప్రజలకు, అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఇచ్చినా ఐదేళ్లలో అమరావతిలో ఎలాంటి నిర్మాణం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యమేనన్నారు. ఐదేళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోయామన్నారు. కాబట్టి చంద్రబాబు ముందుగా అమరావతి రైతులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా […]
విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముందు రాజధాని ప్రాంత ప్రజలకు, అక్కడి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం ఇచ్చినా ఐదేళ్లలో అమరావతిలో ఎలాంటి నిర్మాణం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యమేనన్నారు.
ఐదేళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోయామన్నారు. కాబట్టి చంద్రబాబు ముందుగా అమరావతి రైతులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు రెహమాన్ ప్రకటించారు.
విశాఖను రాజధానిగా ఈ ప్రాంతవాసులు స్వాగతిస్తే అది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతున్న వేళ దాన్ని వ్యతిరేకిస్తే చరిత్రహీనులవుతారన్నారు. తాము అలా చరిత్రహీనులుగా మిగిలిపోదలుచుకోలేదని… అందుకే చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు రెహమాన్ చెప్పారు.