రణబీర్ స్థానంలో ప్రభాస్

అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి త్వరలోనే ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2 రోజుల కిందటే ఈ ప్రాజెక్టు విశేషాలు బయటకొచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి ఈరోజు బయటకొచ్చింది. నిజానికి ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చేయాల్సిన సినిమా ఇదని తెలుస్తోంది. కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డికి, రణబీర్ పిలిచి అవకాశం ఇచ్చాడు. అలా వీళ్లిద్దరి […]

Advertisement
Update:2019-12-25 15:30 IST

అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ రెడ్డి వంగతో కలిసి త్వరలోనే ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. 2 రోజుల కిందటే ఈ ప్రాజెక్టు విశేషాలు బయటకొచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి ఈరోజు బయటకొచ్చింది. నిజానికి ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదట. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ చేయాల్సిన సినిమా ఇదని తెలుస్తోంది.

కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డికి, రణబీర్ పిలిచి అవకాశం ఇచ్చాడు. అలా వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఓ స్టోరీ కూడా ఫైనలైజ్ అయింది. అయితే ఆఖరి నిమిషంలో ఆ స్టోరీ నుంచి రణబీర్ తప్పుకున్నాడు. పూర్తిగా నమ్మకం కుదరకపోవడంతోనే రణబీర్ ఆ పని చేశాడంటూ బాలీవుడ్ లో కథనాలు కూడా వచ్చాయి.

అయితే సందీప్ రెడ్డి వంగ మామూలోడు కాదు. హీరో రిజెక్ట్ చేస్తే మళ్లీ అతడ్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు ఈ దర్శకుడు. నేరుగా వెళ్లి ప్రభాస్ కు అదే స్టోరీ చెప్పాడు. కథ వినడం, ప్రభాస్ ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. జాన్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News