రాజమౌళి సక్సెస్ సీక్రెట్ చెప్పిన ‘సరిలేరు’ దర్శకుడు
ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని బేస్ చేసుకొని వెళితేనే సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. అది గుర్తెరిగిన వారే ఇప్పుడు సమాజంలో విజయవంతమైన వ్యక్తులుగా ఉన్నారు. మన బలం, బలహీనత తెలిసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దేశంలో సక్సెస్ ఫుల్ అయిన వారిని పరిశీలిస్తే అదే విషయం స్పష్టమవుతోంది. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న జక్కన్న రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే దానిపై ఇప్పటికే చర్చోపచర్చలు సాగాయి. తన తొలి సినిమా నుంచి […]
ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలం ఉంటుంది. ఆ బలాన్ని బేస్ చేసుకొని వెళితేనే సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. అది గుర్తెరిగిన వారే ఇప్పుడు సమాజంలో విజయవంతమైన వ్యక్తులుగా ఉన్నారు. మన బలం, బలహీనత తెలిసినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
దేశంలో సక్సెస్ ఫుల్ అయిన వారిని పరిశీలిస్తే అదే విషయం స్పష్టమవుతోంది. బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న జక్కన్న రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే దానిపై ఇప్పటికే చర్చోపచర్చలు సాగాయి. తన తొలి సినిమా నుంచి ఇప్పటిదాకా అపజయం ఎరుగని రాజమౌళి స్టామినా ఏంటనేది అందరిలోనూ ఆసక్తి రేపే ప్రశ్న. తాజాగా రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఇదేనని…. తాను కనిపెట్టానని అంటున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి.
మహేష్ బాబు తో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తీస్తున్న అనిల్ రావిపూడి తాజాగా ఆ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి ఫుల్ పాజిటవ్ రెస్పాన్స్ వచ్చింది. గూస్ బంబ్స్ వచ్చేలా ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే తొలి సినిమా పటాస్ నుంచి సుప్రీం, రాజాది గ్రేట్, ఎఫ్2 లాంటి వరుస హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా అనిల్ రావిపూడి జక్కన్న రాజమౌళి సక్సెస్ సీక్రెట్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు..
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘రాజమౌళి సినిమాలన్నింటిని తాను వందల సార్లు చూశాను. ఆయన సినిమాలు హిట్ కావడాన్ని గమనిస్తే అందలో ఒకే ఒక పాయింట్ కనపడింది. అదే ‘ఎమోషన్’. రాజమౌళి బలమే ఎమోషన్. దాని చుట్టూనే ఆయన సినిమాలు ఉంటాయి. అదే ఆయన సక్సెస్ సీక్రెట్’ అని చెప్పుకొచ్చాడు..
ఒక కథకుడు, దర్శకుడు తన బలాన్ని గుర్తెరగాలని.. తన బలం కామెడీ టైమింగ్ కథలని.. అందుకే అలాంటి సినిమాలే తీస్తున్నానని అనిల్ చెప్పుకొచ్చాడు. ఇలా రావిపూడి చెప్పిన రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.