అవును ముందు సరదా పడ్డారు... ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది...
తానేమీ సరదా పడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని.. కావాలంటే తనను విమర్శిస్తున్న వారు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాపై క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చెప్పింది నిజమే అంటూ కామెంట్ చేశారు. తనలాగే అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చిన పవన్‌కు అభినందనలు అంటూ సెటైర్ వేశారు. ”అవును నిజమే…మీరు సరదాపడి మూడుపెళ్లిళ్ళు చేసుకోలేదు. ముందు సరదాపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి […]
తానేమీ సరదా పడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని.. కావాలంటే తనను విమర్శిస్తున్న వారు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాపై క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ చెప్పింది నిజమే అంటూ కామెంట్ చేశారు. తనలాగే అందరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందిగా సలహా ఇచ్చిన పవన్‌కు అభినందనలు అంటూ సెటైర్ వేశారు.
”అవును నిజమే…మీరు సరదాపడి మూడుపెళ్లిళ్ళు చేసుకోలేదు. ముందు సరదాపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే… పాపం!” అంటూ వ్యాఖ్యానించారు.
మీడియా సమావేశంలో తాను చెప్పాల్సింది చెప్పి… విలేకర్ల ప్రశ్నలను ఎదుర్కొనకుండానే పవన్ కల్యాణ్ హడావుడిగా వెళ్లిపోవడాన్ని కూడా కత్తి మహేష్ ఎద్దేవా చేశారు.
” 100 కోట్లతో సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయని గర్వపడ్డ పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాడనే ఆశతో వెంటబడ్డ పాత నిర్మాతలు. ప్రెస్ మీట్ నుంచీ పరుగెత్తిన పవన్.” అంటూ ఎద్దేవా చేశారు.
బెజవాడ రోడ్లపై గొడవలకు తాను సిద్ధమని పవన్ కల్యాణ్ ప్రకటించడాన్ని కూడా కత్తి మహేష్ ప్రస్తావించారు. గొడవలకు సిద్ధమన్న పవన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
”విజయవాడ రోడ్లలో కొట్టుకోవడానికి సంసిద్ధత వ్యక్తపరిచిన పవన్ కళ్యాణ్. ఇప్పుడే మీటింగ్ నుంచి జిమ్ కెళ్లారని సమాచారం. ఆల్ ది బెస్ట్.” అంటూ కామెంట్ చేశారు.
తాను సంస్కారవంతుడిని అని ప్రెస్‌మీట్‌లో ఒకవైపు చెబుతూనే మరోవైపు ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని కత్తి మహేష్ తప్పుపట్టారు.
”తెలుగుభాష నాకు (తాట తీసే) సంస్కారాన్ని నేర్పింది అంటూ తన మీద తానే ముచ్చటపడ్డ పవన్ కళ్యాణ్. వ్యక్తిగత విమర్శ చెయ్యను చెయ్యను అంటూనే జగన్ ని ఫ్యాక్షనిస్టు అని గౌరవంగా పిల్చిన గాలి పెళ్ళోడికి నా అభినందనలు..” అంటూ కత్తి మహేష్ కామెంట్ చేశారు.