భారత సంతతి వ్యక్తికి నోబెల్ బహుమతి
భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డును ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌తో కలసి ఆయన సాధించారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలన పై పరిశోధన, ప్రతిపాదనలకు సంబంధించి ఈ ముగ్గురికి ఈ అవార్డు లభించింది. కాగా ఈ అవార్డును పంచుకుంటున్న ఎస్తేర్ డఫ్లో స్వయంగా అభిజిత్ భార్య కావడం విశేషం. బెంగాలీ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ముంబైలో జన్మించి అమెరికాలో […]
భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డును ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌తో కలసి ఆయన సాధించారు. ప్రపంచంలో పేదరిక నిర్మూలన పై పరిశోధన, ప్రతిపాదనలకు సంబంధించి ఈ ముగ్గురికి ఈ అవార్డు లభించింది. కాగా ఈ అవార్డును పంచుకుంటున్న ఎస్తేర్ డఫ్లో స్వయంగా అభిజిత్ భార్య కావడం విశేషం.
బెంగాలీ సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ముంబైలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక ఫ్రెంచ్-అమెరికన్ అయిన అతని భార్య ఎస్తేర్ డఫ్లో గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాదారుగా పని చేశారు. వీరిద్దరూ మైఖెల్ క్రెమర్‌తో కలసి ఈ పరిశోధన చేశారు.
అభిజిత్ బెనర్జీ (58), డఫ్లో (46) ఇద్దరూ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్లు కాగా.. క్రెమర్ (54) హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రదానం చేస్తున్న దగ్గర నుంచి ఈ అవార్డు అందుకున్న పిన్న వయస్కురాలు, రెండో మహిళ డఫ్లో కావడం విశేషం. అంతకు ముందు 2009లో ఎలినార్ ఆస్ట్రమ్ ఈ అవార్డు అందుకున్నారు.