కరెంట్ గానే తిరిగిస్తామని... కరెంట్ అప్పు తెచ్చిన ఘనుడు బాబు

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలకు తోడు… చంద్రబాబు చేసిన పని వల్ల ఇప్పుడు ఏపీ ఒత్తిడి ఎదుర్కొంటోంది. విద్యుత్ కొరతకు ప్రధాన కారణంగా బొగ్గు సమస్య ఉంది. ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు రోజుకు 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా… ప్రస్తుతం 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమేవస్తోంది. ఇందుకు కారణం ఒడిషాలోని మహానది బొగ్గుక్షేత్రంలో కార్మికుల 15 రోజుల సమ్మె ఒకటి. కార్మికుల సమ్మె వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఏపీకి సరఫరా […]

Advertisement
Update:2019-09-30 07:27 IST

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారీ వర్షాలకు తోడు… చంద్రబాబు చేసిన పని వల్ల ఇప్పుడు ఏపీ ఒత్తిడి ఎదుర్కొంటోంది. విద్యుత్ కొరతకు ప్రధాన కారణంగా బొగ్గు సమస్య ఉంది. ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు రోజుకు 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా… ప్రస్తుతం 45వేల మెట్రిక్ టన్నులు మాత్రమేవస్తోంది. ఇందుకు కారణం ఒడిషాలోని మహానది బొగ్గుక్షేత్రంలో కార్మికుల 15 రోజుల సమ్మె ఒకటి. కార్మికుల సమ్మె వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఏపీకి సరఫరా ఆగిపోయింది.

ఇంతలోనే భారీ వర్షాలు రావడంతో ఏపీకి బొగ్గును సరఫరా చేసే మహానది క్షేత్రంతో పాటు, సింగరేణి బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. బొగ్గు కొరతపై స్పందించిన సీఎం జగన్‌… తెలంగాణ సీఎంతో మాట్లాడారు. దాంతో ఏపీకి అదనంగా 31.5 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని ఏపీ జెన్‌ కో అధికారులు చెబుతున్నారు.

విద్యుత్ ఇబ్బందికి మరో కారణం చంద్రబాబు విద్యుత్ అప్పు. ఎన్నికల సమయంలో తాను విమర్శల పాలవకుండా ఉంటే చాలన్న ఉద్దేశంతో ఉత్తరాది నుంచి 3.8 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అప్పుగా తెచ్చారు. దాన్ని తిరిగి విద్యుత్ రూపంలోనే చెల్లించాలి. జూన్ 15 నుంచి ఏపి ప్రభుత్వం ఆ విద్యుత్‌ను రోజుకు 15వందల మెగావాట్ల చొప్పున తిరిగి చెల్లిస్తోంది. దాని వల్ల కూడా విద్యుత్‌ విషయంలో ఏపీ ఒత్తిడి ఎదుర్కొంటోంది. 2018 నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు చంద్రబాబు ఇలా నిరంతరాయంగా ఉత్తరాది నుంచి విద్యుత్‌ను అప్పు తెచ్చారు. దాన్ని తీర్చే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది.

డొంకరాయి- దిగువ సీలేరు వద్ద విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కాలువకు ఇటీవల భారీ వర్షాల కారణంతో గండి పడి ఉత్పత్తి ఆగిపోయింది. దాని వల్ల 400 మెగావాట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

ఏ రాష్ట్రమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ముందుగానే లెటర్‌ ఆఫ్ క్రెడిట్ చూపాలి. అంటే విద్యుత్ కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలి. కానీ గత కొన్ని నెలలుగా ఏపీ ప్రభుత్వం అలా చేయకపోవడంతో పవర్‌ ఎక్సైంజ్‌లో ఏపీ కరెంట్ కొనలేని పరిస్థితి వచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాలతో తక్షణం లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య పరిష్కారం కోసం 570 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఈ మార్గంలోనూ విద్యుత్‌ ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది.

చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి ఏడు గంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్‌ను 9 గంటలు ఇస్తోంది. ఇది కూడా విద్యుత్ సరఫరాను ఒత్తిడికి గురి చేస్తోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డే నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బొగ్గు కొరత నేపథ్యంలో సింగరేణి గనుల నుంచి బొగ్గు సరఫరాను పెంచాల్సిందిగా తెలంగాణ సీఎంను జగన్‌ కోరారు. ఇందుకు కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించారు. 31వేల 500 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి అంగీకరించిందని ఏపీ జెన్‌ కో అధికారులు వెల్లడించారు. అటు ఒప్పందాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏపీ సీఎం లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం సరిపడా బొగ్గును సరఫరా చేయాలని… అలా కానీ పక్షంలో ప్రత్యామ్నాయం చూడాలని కేంద్ర బొగ్గు శాఖకు జగన్‌ మోహన్ రెడ్డి లేఖ రాశారు.

Tags:    
Advertisement

Similar News