యూజీసీ గైడ్‌లైన్స్‌ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉన్నయ్‌

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి

Advertisement
Update:2025-01-27 18:30 IST

యూజీసీ ప్రతిపాదించిన డ్రాఫ్ట్‌ రూల్స్‌ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకృష్ణారెడ్డి తెలిపారు. వీసీలుగా బ్యూరోక్రాట్లను నియమించుకోవాలని ప్రతిపాదించడం సరికాదని తెలిపారు. అలాగే వీసీల నియామకంలో డ్రాఫ్ట్‌ ప్రపోజల్స్‌ రాష్ట్రల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని ఈ గైడ్‌లైన్స్‌ దెబ్బతీసేలా ఉన్నాయని.. వర్సిటీలు ఎప్పటికీ స్వతంత్రంగానే ఉండాలని తెలిపారు. యూజీసీ గైడ్‌లైన్స్‌ పై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.. ఆ నివేదిక వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News