ఆ "హీరో" ఇక మనకు కనిపించడు

డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతున్న టైమ్ లోనే హీరో అనే సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ చేస్తున్న ఆ సినిమా ఆగిపోయిందంటూ అప్పట్లోనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. హీరో ప్రాజెక్టు ఆగిపోయినట్టు విజయ్ దేవరకొండ అంగీకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిథులతో ఆఫ్-ది రికార్డు మాట్లాడిన విజయ్ దేవరకొండ, హీరో సినిమా ఇక ఉండదని ప్రకటించాడు. ఆ స్థానంలో పూరి జగన్నాధ్ తో చేయాల్సిన ఫైటర్ సినిమాను సెట్స్ […]

Advertisement
Update:2019-09-21 08:30 IST

డియర్ కామ్రేడ్ రిలీజ్ అవుతున్న టైమ్ లోనే హీరో అనే సినిమాపై అనుమానాలు రేకెత్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ చేస్తున్న ఆ సినిమా ఆగిపోయిందంటూ అప్పట్లోనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. హీరో ప్రాజెక్టు ఆగిపోయినట్టు విజయ్ దేవరకొండ అంగీకరించాడు. కొంతమంది మీడియా ప్రతినిథులతో ఆఫ్-ది రికార్డు మాట్లాడిన విజయ్ దేవరకొండ, హీరో సినిమా ఇక ఉండదని ప్రకటించాడు. ఆ స్థానంలో పూరి జగన్నాధ్ తో చేయాల్సిన ఫైటర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు.

అటు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు సంబంధించి అన్ని సెటిల్ మెంట్స్ పూర్తిచేశారు. దర్శకుడు ఆనంద్ అన్నామళైకి కొంత ముట్టజెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించుకున్నారు. హీరోయిన్ కు కూడా కొంత పరిహారం చెల్లించి మమ అనిపించారు. ప్రొడక్షన్ యూనిట్ కు కూడా పనిచేసినన్ని రోజులకు లెక్క అప్పజెప్పారు. చివరికి మ్యూజిక్ డైరక్టర్ కు కూడా కొంత ముట్టజెప్పాల్సి వచ్చింది.

ఢిల్లీలో జరిగిన ఈ సినిమా షెడ్యూల్ కోసం అక్షరాలా 4 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఆ 4 కోట్లుతో పాటు సెటిల్ మెంట్స్ అన్నీ కలుపుకొని నిర్మాతలకు 8-9 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. వీటిని భర్తీ చేయడం కోసం మైత్రీ బ్యానర్ పైనే మరో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.

 

Tags:    
Advertisement

Similar News