100 అడుగులు ఎగిరిపడ్డ కారు... కుటుంబం సజీవ దహనం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీటీడీ ఉద్యోగి విష్ణు కుటుంబం సజీవ దహనం అయింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులోని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. తిరుపతి టీఎంసీ సిగ్నల్ ప్రాంతానికి చెందిన విష్ణు ఇంటికి ఇటీవల అతడి సోదరి, ఆమె కుమారుడు భాను తేజ వచ్చారు. వారిని తిరిగి బెంగళూరులో వదిలిపెట్టేందుకు విష్ణు తన భార్య, కుమారుడు, కుమార్తెతో […]
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీటీడీ ఉద్యోగి విష్ణు కుటుంబం సజీవ దహనం అయింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో డీజిల్ ట్యాంక్ పేలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులోని ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
తిరుపతి టీఎంసీ సిగ్నల్ ప్రాంతానికి చెందిన విష్ణు ఇంటికి ఇటీవల అతడి సోదరి, ఆమె కుమారుడు భాను తేజ వచ్చారు. వారిని తిరిగి బెంగళూరులో వదిలిపెట్టేందుకు విష్ణు తన భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి కారులో బయలుదేరాడు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న యాంగర్‌ను ఢీకొట్టింది.
దాంతో కారు వేగానికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరి పక్కనే ఉన్న గోతిలో పడింది. దాంతో ఒక్కసారిగా డిజిల్ ట్యాంకు పేలిపోయింది. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న విష్ణు తీవ్ర గాయాలతో బయటకు ఎగిరిపడ్డాడు. మిగిలిన కుటుంబ సభ్యులు ఐదుగురు కారులోనే సజీవ దహనం అయ్యారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పి మృతదేహాలను బయటకు తీశారు.