రానా ఇంకా అమెరికాలోనే!

లెక్కప్రకారం రానా ఈపాటికి విమానంలో ఉండాలి. రేపు ఈ టైమ్ కు ఇండియాలో ల్యాండ్ అవ్వాలి. కానీ షెడ్యూల్ మారింది. రానా రావడం లేదు. అమెరికాలోనే మరో 2 వారాల పాటు ఉండబోతున్నాడు ఈ దగ్గుబాటి హీరో. రానాకు అమెరికాలో కిడ్నీ సమస్యకు సంబంధించి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ నుంచి రానా తొందరగానే కోలుకున్నాడు. వెంటనే ట్విట్టర్ లో ఫొటోలు కూడా పెట్టాడు. ఇండియాకు రాబోతున్నాననే విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు కూడా. […]

Advertisement
Update:2019-08-30 14:59 IST

లెక్కప్రకారం రానా ఈపాటికి విమానంలో ఉండాలి. రేపు ఈ టైమ్ కు ఇండియాలో ల్యాండ్ అవ్వాలి. కానీ షెడ్యూల్ మారింది. రానా రావడం లేదు. అమెరికాలోనే మరో 2 వారాల పాటు ఉండబోతున్నాడు ఈ దగ్గుబాటి హీరో.

రానాకు అమెరికాలో కిడ్నీ సమస్యకు సంబంధించి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ నుంచి రానా తొందరగానే కోలుకున్నాడు. వెంటనే ట్విట్టర్ లో ఫొటోలు కూడా పెట్టాడు. ఇండియాకు రాబోతున్నాననే విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు కూడా.

అంతా ఓకే అనుకున్న టైమ్ లో వైద్యులు, రానాను ఆపేశారు. మరో 2 వారాల పాటు అమెరికాలోనే ఉండాలని సూచించారు. సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, మరికొన్ని టెస్టులు చేయాలని.. అవి కూడా పూర్తయిన తర్వాత వెళ్తే బాగుంటుందని సూచించారు. వైద్యులు చెప్పడంతో రానా కూడా ఏం చేయలేకపోయాడు.

సెప్టెంబర్ మొదటి వారం నుంచి విరాటపర్వం షెడ్యూల్ ప్లాన్ చేశారు. రానా వస్తే ఆ షెడ్యూల్ మొదలవుతుంది. రానా డ్రాప్ అవ్వడంతో విరాటపర్వం షెడ్యూల్ నిలిచిపోయింది. అంతేకాదు, గుణశేఖర్ దర్శకత్వంలో అతడు చేయాల్సిన హిరణ్యకశిప సినిమా కూడా ఆలస్యం అవుతోంది.

Tags:    
Advertisement

Similar News