మాటల రచయితగా మారిన దర్శకుడు

మాటల రచయితలు దర్శకులిగా మారిన సందర్భాలున్నాయి. కానీ సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్న తర్వాత మాటల రచయితగా మారిన వాళ్లు మాత్రం లేరు. ఉదాహరణకు త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్లనే తీసుకుంటే.. వీళ్లు దర్శకులుగా మారిన తర్వాత ఇతర సినిమాలకు డైలాగ్స్ రాయడం మానేశారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం దర్శకుడిగా ఎదిగిన తర్వాత మాటల రచయితగా మారాడు. పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే తన రెండో ప్రయత్నంగా […]

Advertisement
Update:2019-08-29 01:31 IST

మాటల రచయితలు దర్శకులిగా మారిన సందర్భాలున్నాయి. కానీ సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్న తర్వాత మాటల రచయితగా మారిన వాళ్లు మాత్రం లేరు. ఉదాహరణకు త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వాళ్లనే తీసుకుంటే.. వీళ్లు దర్శకులుగా మారిన తర్వాత ఇతర సినిమాలకు డైలాగ్స్ రాయడం మానేశారు. కానీ తరుణ్ భాస్కర్ మాత్రం దర్శకుడిగా ఎదిగిన తర్వాత మాటల రచయితగా మారాడు.

పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ దర్శకుడు అనిపించుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే తన రెండో ప్రయత్నంగా ఈ దర్శకుడు తీసిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా మాత్రం ఆశించిన ఫలితం అందివ్వలేదు. అదే టైమ్ లో నటుడిగా కూడా మారిపోయాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఏకంగా మాటల రచయిత అవతారం ఎత్తాడు. శర్వానంద్ కొత్త సినిమాకు ఇతడు డైలాగ్స్ రాయబోతున్నాడు.

ఈరోజు కల్యాణ్ రామ్ కొత్త సినిమా లాంఛ్ అయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై చెన్నైలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీతూవర్మ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాకు మాటలు అందించబోతున్నాడు తరుణ్ భాస్కర్. ఈ దర్శకుడు, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    
Advertisement

Similar News