నో నామినేషన్... నో కొటేషన్.. నో కమిషన్...

అన్నీ ఓపెన్… అంతటా ఓపెన్…. కమిషన్లు లేవు…. మనవాడే ఇచేద్దామనే సిఫార్సులు లేవు…. అంతా ప్రజల కళ్ల ముందు కట్టిన పారదర్శక పాలన. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఏ ఏ పనులు చేస్తున్నారు? వంటి అంశాలన్నీ ప్రజల కళ్ల ముందుంచే పారదర్శక పాలన. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? ఏ దేశంలో అని ఆశ్చర్యపోతున్నారా..? ఎక్కడో కాదు.. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. పాదయాత్ర లోను, మేనిఫెస్టోలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్లుగా పారదర్శక పాలన […]

Advertisement
Update:2019-08-27 08:30 IST

అన్నీ ఓపెన్… అంతటా ఓపెన్…. కమిషన్లు లేవు…. మనవాడే ఇచేద్దామనే సిఫార్సులు లేవు…. అంతా ప్రజల కళ్ల ముందు కట్టిన పారదర్శక పాలన. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఏ ఏ పనులు చేస్తున్నారు? వంటి అంశాలన్నీ ప్రజల కళ్ల ముందుంచే పారదర్శక పాలన.

ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా..? ఏ దేశంలో అని ఆశ్చర్యపోతున్నారా..? ఎక్కడో కాదు.. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. పాదయాత్ర లోను, మేనిఫెస్టోలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్లుగా పారదర్శక పాలన పరమార్థంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి కార్యదర్శుల నియామకం పూర్తయిన వేళ వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయానికి తెర తీస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

గత ప్రభుత్వ హయాంలో అయిన వారికి కోట్ల రూపాయలు కంచంలో సిద్ధంగా చేసిన పాలనకు పూర్తిగా చరమాంకం పాడుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గ్రామ స్థాయిలో సైతం ఏ పనులకు ఎంత టెండర్లు పిలిచారు? ఎన్ని టెండర్లు దాఖలు అయ్యాయి? ఎవరు ఎంత కోట్ చేశారు? వంటి అంశాలతో సహా ఈ టెండరింగ్ విధానాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 11, 158 గ్రామ సచివాలయాలు, 3, 758 వార్డు సచివాలయాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటికి కావలసిన ఫర్నిచర్, కంప్యూటర్లు, ప్రింటర్లతో సహా ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ రివర్స్ టెండరింగ్ ద్వారానే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.

అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఇతర విభాగాలకు చెందిన ముఖ్య అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం అందింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన సచివాలయ కార్యదర్శులకు సమకూర్చే సెల్ ఫోన్లను కూడా టెండరింగ్, రివర్స్ టెండరింగ్ ల ద్వారానే కొనుగోలు చేయాలని మార్గదర్శకాలను విడుదల చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శాసనసభకు సంబంధించిన ఫర్నిచర్ తో సహా కంప్యూటర్లను కూడా తన ఇంటికి తరలించడంతో ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసి పోయింది. నూతనంగా ఏర్పడిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఏ పనులలోను ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా పారదర్శక పాలనకే పెద్ద పీట వేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటి వరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రతి గ్రామ సచివాలయంలోను, వార్డు సచివాలయాలలోను ప్రతిరోజు జరిగేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రతి రోజు జరిగే స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాకుండా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News