అన్నీ రీమేక్స్... పైకి మాత్రం చెప్పరంతే!

ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్ గా మన్మథుడు-2 తెరకెక్కింది. కానీ విడుదల వరకు ఆ విషయాన్ని బయటపెట్టలేదు యూనిట్. తాజాగా వచ్చిన ఎవరు సినిమా కూడా ఓ రీమేకే. ది ఇన్విడబుల్ గెస్ట్ అనే స్పానిష్ మూవీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇవన్నీ రీమేక్స్ అనే విషయాల్ని మేకర్స్ బయటపెట్టడం లేదు. తమది స్ట్రయిట్ మూవీ అనే విధంగా కలరింగ్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో రాజశేఖర్ కూడా చేరాడు. రాజశేఖర్ కొత్త […]

Advertisement
Update:2019-08-23 00:32 IST

ఓ ఫ్రెంచ్ సినిమా రీమేక్ గా మన్మథుడు-2 తెరకెక్కింది. కానీ విడుదల వరకు ఆ విషయాన్ని బయటపెట్టలేదు యూనిట్. తాజాగా వచ్చిన ఎవరు సినిమా కూడా ఓ రీమేకే. ది ఇన్విడబుల్ గెస్ట్ అనే స్పానిష్ మూవీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇవన్నీ రీమేక్స్ అనే విషయాల్ని మేకర్స్ బయటపెట్టడం లేదు. తమది స్ట్రయిట్ మూవీ అనే విధంగా కలరింగ్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో రాజశేఖర్ కూడా చేరాడు.

రాజశేఖర్ కొత్త సినిమాకు సంబంధించి నిన్ననే అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చింది. ప్రదీప్ కృష్ణమూర్తి డైరక్షన్ లో ధనుంజయన్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. ఇది ఒక కన్నడ రీమేక్. అయితే ఈ విషయాన్ని మాత్రం మేకర్స్ బయటపెట్టడం లేదు. పైపెచ్చు.. సింగిల్ లైన్ కథ విని రాజశేఖర్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటూ ఘనంగా ప్రకటించుకున్నారు.

భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తో పాటు ఎన్నో డిజిటల్ మాధ్యమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏ భాషలో సినిమానైనా జస్ట్ ఒక్క క్లిక్ తో చూసే వెసులుబాటు వచ్చేసింది. ఏదైనా రీమేక్ సినిమా ప్రకటిస్తే, వెంటనే సదరు ఒరిజినల్ మూవీని ఆడియన్స్ ఈజీగా చూడొచ్చు. దీనివల్ల రీమేక్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందనేది మేకర్స్ భయం. పైగా ఒరిజినల్ మూవీతో రీమేక్ ను పోల్చేవారు కూడా ఎక్కువవుతారు.

ఎవరు సినిమా రీమేక్ అనే విషయాన్ని అందుకే చెప్పలేదు. ఇప్పుడు రాజశేఖర్ మూవీ కూడా ఓ కన్నడ రీమేక్ అనే విషయాన్ని అందుకే చెప్పడం లేదు. ఒకప్పుడు రీమేక్ రైట్స్ తీసుకోకుండా.. ఒరిజినల్ కథను కాపీ కొట్టేవాళ్లు. బండారం బయటపడుతుందని ఆ విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. ఇప్పుడు రైట్స్ తీసుకొని మరీ రీమేక్ చేస్తున్నప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారు.

Tags:    
Advertisement

Similar News