వాళ్లిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటారంట

హీరోహీరోయిన్లకు మేనేజర్లు ఉంటారు. వాళ్లు చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అగ్రిమెంట్ వ్యవహారాలు, కాల్షీట్ల సర్దుబాట్లు, చెక్కులు కలెక్ట్ చేసుకోవడం, ప్రయాణానికి ఏర్పాట్లు చూసుకోవడం లాంటివి వాళ్లు చేస్తుంటారు. కానీ వీటితో పాటు కథలో కూడా కలుగజేసుకునే మేనేజర్లు పెద్దగా కనిపించరు. కానీ రాజ్ తరుణ్ వద్ద మాత్రం అలాంటి మేనేజర్ ఉన్నాడు. అతడే రాజారవీంద్ర. అందరికీ ఇతడు ఓ నటుడిగానే తెలుసు. కానీ చాలామంది హీరోలకు ఇతడు మేనేజర్ గా వ్యవహరిస్తాడనే విషయం చాలా […]

Advertisement
Update:2019-08-17 07:39 IST

హీరోహీరోయిన్లకు మేనేజర్లు ఉంటారు. వాళ్లు చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అగ్రిమెంట్ వ్యవహారాలు, కాల్షీట్ల సర్దుబాట్లు, చెక్కులు కలెక్ట్ చేసుకోవడం, ప్రయాణానికి ఏర్పాట్లు చూసుకోవడం లాంటివి వాళ్లు చేస్తుంటారు.

కానీ వీటితో పాటు కథలో కూడా కలుగజేసుకునే మేనేజర్లు పెద్దగా కనిపించరు. కానీ రాజ్ తరుణ్ వద్ద మాత్రం అలాంటి మేనేజర్ ఉన్నాడు. అతడే రాజారవీంద్ర.

అందరికీ ఇతడు ఓ నటుడిగానే తెలుసు. కానీ చాలామంది హీరోలకు ఇతడు మేనేజర్ గా వ్యవహరిస్తాడనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాంటి హీరోల్లో రాజ్ తరుణ్ ఒకడు.

వీళ్లిద్దరూ ఎంత క్లోజ్ అంటే.. రాజ్ తరుణ్ చేయాల్సిన సినిమాల కథల్ని కూడా రాజా రవీంద్ర వింటుంటాడు. తామిద్దరి మధ్య అలాంటి అండర్ స్టాండింగ్ ఉందంటున్నాడు ఈ నటుడు కమ్ మేనేజర్.

టాక్సీవాలా, శతమానంభవతి లాంటి సినిమాలు ముందుగా రాజ్ తరుణ్ వద్దకే వచ్చాయని, వాటిని తామిద్దరం తిరస్కరించామని గర్వంగా చెబుతున్నాడు రాజా రవీంద్ర.

మరోవైపు తను మాత్రమే కొన్ని కథలు ఓకే చేస్తుంటానని, వాటిలో కొన్ని హిట్స్, మరికొన్ని ఫ్లాపులు ఉన్నాయంటున్నాడు. రాజుగాడు సినిమా కథను అలానే ఓకే చేశానని కానీ అది ఫ్లాప్ అయిందంటున్నాడు.

మొత్తమ్మీద రాజ్ తరుణ్ కు అన్నీ తానే అనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు రాజా రవీంద్ర. గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం వల్ల సక్సెస్ ఫుల్ కథల్ని సరిగ్గా జడ్జ్ చేయలేకపోయానంటున్న రాజీరవీంద్ర.. ప్రస్తుతం రాజ్ తరుణ్ కోసం ఐదుగురు నిర్మాతలు రెడీగా ఉన్నారని అంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News