విరాటపర్వం సెట్స్ పైకొచ్చిన బాలీవుడ్ నటి

విరాటపర్వం సినిమా నుంచి టబు తప్పుకుందనే విషయం తెలిసిందే… ఆ స్థానంలో నందిత దాస్ ను తీసుకున్నారనే విషయాన్ని కూడా స్పష్టంచేసింది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నందిత దాస్.. విరాటపర్వం సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఆమెపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 1980ల్లో తెలంగాణ పల్లెల్లో ఉన్న నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో విరాటపర్వం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సీతక్క అనే […]

Advertisement
Update:2019-08-14 15:16 IST

విరాటపర్వం సినిమా నుంచి టబు తప్పుకుందనే విషయం తెలిసిందే… ఆ స్థానంలో నందిత దాస్ ను తీసుకున్నారనే విషయాన్ని కూడా స్పష్టంచేసింది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న నందిత దాస్.. విరాటపర్వం సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఆమెపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

1980ల్లో తెలంగాణ పల్లెల్లో ఉన్న నక్సల్ ఉద్యమం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథతో విరాటపర్వం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సీతక్క అనే నక్సల్ పాత్ర కోసం టబును సంప్రదించారు. చాన్నాళ్లుగా తెలుగుతెరకు దూరమైన టబు, ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే అంతలోనే బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఛాన్స్ రావడంతో వెంటనే అటు షిఫ్ట్ అయింది. ఈ నేపథ్యంలో టబు స్థానంలో నందిత దాస్ ను తీసుకున్నారు.

సినిమాలో రానా, సాయిపల్లవి పాత్రల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర నందిత దాస్ దే. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్లను ఒకటి చేసే క్రమంలో నందిత దాస్ పై చాలా సన్నివేశాలు వస్తాయి. అటు క్లైమాక్స్ లో కూడా ఈమె పాత్ర చాలా కీలకం. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఇందులో నటించడానికి అంగీకరించిందామె. నందిత దాస్ నటిస్తున్న మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే.

Tags:    
Advertisement

Similar News