చిరు.... కాఫీ, దోశ కథ ఇదే!

మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ముందుగా కాసిన్ని మంచినీళ్లిస్తాం.. ఆ తరువాత టీ ఇచ్చి గౌరవిస్తాం.. కొంచెం అఫీషీయల్‌గా ఉండాలనుకుంటే కాఫీ ఇచ్చి మర్యాద చేస్తాం. ఈ కాఫీ సంప్రదాయం మనం కొన్ని ఇళ్లల్లో మాత్రమే చూస్తుంటాం. ఇక సినిమా పరిశ్రమలోని వారికి కాఫీ తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. కానీ కాఫీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్లు దాని రుచి మరిగాక.. ఒక్క స్విప్‌ అయినా చేయనిదే నిద్రపోకుండా ఉండలేమంటున్నారు. అయితే […]

Advertisement
Update:2019-08-06 09:28 IST

మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ముందుగా కాసిన్ని మంచినీళ్లిస్తాం.. ఆ తరువాత టీ ఇచ్చి గౌరవిస్తాం.. కొంచెం అఫీషీయల్‌గా ఉండాలనుకుంటే కాఫీ ఇచ్చి మర్యాద చేస్తాం. ఈ కాఫీ సంప్రదాయం మనం కొన్ని ఇళ్లల్లో మాత్రమే చూస్తుంటాం.

ఇక సినిమా పరిశ్రమలోని వారికి కాఫీ తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. కానీ కాఫీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్లు దాని రుచి మరిగాక.. ఒక్క స్విప్‌ అయినా చేయనిదే నిద్రపోకుండా ఉండలేమంటున్నారు.

అయితే మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఆయన సతీమణి చేసిన కాఫీని తాగకుండా ఉండలేనంటున్నారు. అలాగే సురేఖ చేతితో చేసిన దోశను రోజుకు ఒక్కసారైనా తింటానని అంటున్నారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలోని కొందరు సురేఖ చేసే కాఫీ, దోశ తినాలని ఏదో వంకతో ఆయన ఇంటికి వస్తుంటారని చర్చించుకుంటున్నారు.

చిరుకి మొదట్లో కాఫీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట.. కానీ ఇప్పుడు కాఫీ లేకుండా ఉండలేకపోతున్నారట. అలాగే సురేఖ చేసిన దోశ తిననిదే రోజు హాయిగా ఉండదట. మరి ఆయనకు అలా కాఫీ, దోశపై అమిత ప్రేమ ఎందుకు వచ్చిందో ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇంతకీ ఆ ఇంటర్వ్యూ చేసింది ఎవరో కాదు ఆయన స్వయనా కొడలు ఉపాసన. ‘బి పాజిటివ్‌’ అనే మాగ్జిన్‌ కోసం ఉపాసన తన మామ గారైన చిరును ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చిరుకు కాఫీ అంటే ఎందుకు ఇష్టం ఏర్పడిందో చెప్పాలని అడింది.

‘మద్రాసులో సినిమాలు చేస్తున్నప్పుడు సురేఖ నాతోనే ఉండేది. ఆ సమయంలో ఎక్కువగా అక్కడివారు కాఫీని తాగేవారు. కానీ నేను మాత్రం కాఫీని ఆశించేవాడిని కాదు. కాని ఒకసారి సురేఖ బలవంతం పెడితే తాగాను. ఆమె చేతి మహిమో ఎంటో గానీ అప్పటి నుంచి కాఫీ అంటే ఫిదా అయిపోయాను. ఇంతకీ కాఫీని ఎలా చేశావని తనను అడిగాను. అమె నీలగిరి నుంచి ప్రత్యేకంగా గింజలు తెప్పించుకుని వాటిని పొడిచేసి కాఫీని తయారు చేసిందట. అందుకే తన కాఫీ అంత రుచిగా ఉండేది’ అని చిరు చెప్పారు.

అయితే ఈ కాఫీతో పాటు సురేఖ దోశను చాలా రుచిగా చేసేదట. రోజూ ఒక్కసారైనా సురేఖ చేసిన దోశ తిని కాఫీని తాగకుండా ఉండలేరట. అయితే దోశకు ఓ స్టోరీ ఉందని చిరు చెప్పుకొచ్చాడు.

‘ఒకసారి షూటింగ్‌ కోసం మంగుళూరు వెళ్లాం. అక్కడున్న ఓ హోటల్‌లో తిన్న దోశ చాలా రుచిగా ఉంది. దానిని ఎలా తయారు చేస్తారో చెప్పమని అడిగితే వారు చెప్పలేదు. దీంతో సురేఖకు ఈ విషయం చెప్పాను. అయితే అక్కడి దోశ కంటే సురేఖ చేసిన దోశ ఇంకా రుచిగా ఉంది.’ అని చెప్పారు.

ఇంకా దోశ గురించి చెబుతూ ‘మా తోటి నటుల్లో ఒకరు… ఒకసారి సురేఖ దోశను తిన్నవాళ్లు మళ్లీ ఆ దోశ కోసం వచ్చారు. అలాంటి వాళ్లలో ప్రభుదేవా ఒకరు’ అని చిరు నవ్వుతూ చెప్పారు.

బయటివాళ్లు అత్తయ్య దోశ సీక్రెట్‌ తెలుసుకోవచ్చా..? అని ఉపాసన ప్రశ్నించగా ‘హైదరాబాద్‌లోని చట్నీస్‌ హోటల్‌లో పనిచేసే మాస్టర్‌కు దోశ సీక్రెట్‌ చెప్పాం. ఇది తిన్న వాళ్లు ‘చిరు దోశ’ ఇవ్వమని అడుగుతున్నారు’ అని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News