మ్యూజిక్ డైరక్టర్ల మార్పు నా ఆలోచనే.... వాళ్ళను అందుకే తప్పించాము....

సాహో సినిమాకు సంబంధించి సంగీత దర్శకులపై నడిచిన వివాదం గురించి అంతా తెలిసిందే. ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం తప్పుకుంది. ఆ స్థానంలో ఏకంగా ఐదుగురు సంగీత దర్శకుల్ని తీసుకున్నారు. ప్రత్యేకంగా టీజర్స్ కోసం తమన్ ను కూడా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు సుజీత్ స్పందించాడు. పాటకో సంగీత దర్శకుడ్ని పెట్టాలనే ఆలోచన తనదే అంటున్నాడు సుజీత్. ఒకే సంగీత దర్శకుడికి అన్ని పాటల బాధ్యత అప్పగించడం కంటే, ఒక్కో […]

Advertisement
Update:2019-08-04 00:32 IST

సాహో సినిమాకు సంబంధించి సంగీత దర్శకులపై నడిచిన వివాదం గురించి అంతా తెలిసిందే. ఆఖరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం తప్పుకుంది. ఆ స్థానంలో ఏకంగా ఐదుగురు సంగీత దర్శకుల్ని తీసుకున్నారు. ప్రత్యేకంగా టీజర్స్ కోసం తమన్ ను కూడా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు సుజీత్ స్పందించాడు.

పాటకో సంగీత దర్శకుడ్ని పెట్టాలనే ఆలోచన తనదే అంటున్నాడు సుజీత్. ఒకే సంగీత దర్శకుడికి అన్ని పాటల బాధ్యత అప్పగించడం కంటే, ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడికి అప్పగిస్తే మంచి అవుట్ పుట్ వస్తుందని సుజీత్ భావించాడట. అంతేకాదు, ఇలా చేయడం వల్ల పని కూడా తొందరగా అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట.

మరోవైపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాత్రం కేవలం జిబ్రాన్ కు మాత్రమే అప్పగించామని, ఇలా చేయడం వల్ల సినిమాలో ఫీల్ చెడిపోకుండా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం కొత్తకాదని, గతంలో చాలా సందర్భాల్లో ఇలా జరిగిందని, తను మాత్రమే దీనికి ఆద్యుడ్ని కాదని అంటున్నాడు సుజీత్.

ఇన్ని విషయాలు చెప్పిన ఈ దర్శకుడు శంకర్-ఎహసాన్-లాయ్ ను ఎందుకు ప్రారంభంలో తీసుకొని, ఆఖరి నిమిషంలో తప్పించారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

దీనిపై ఆఫ్ ది రికార్డు క్లారిటీ ఇచ్చాడు సుజీత్. వాళ్లు కంపోజ్ చేసిన మ్యూజిక్ తనకు నచ్చలేదని, మరీ ముఖ్యంగా సాహో లాంటి యాక్షన్ సినిమాకు వాళ్లిచ్చిన మ్యూజిక్ ఇప్పటి తరానికి సింక్ కాదని, అందుకే వాళ్లను తప్పించినట్టు మీడియాతో చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News