కొందరు మమ్మల్ని కూల్చాలని చూస్తున్నారు
రోహిత్ శర్మతో తనకు విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా కెప్టెన్ కోహ్లి అసహనం వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించాడు. తాము క్రికెట్ ఎంత బాగా ఆడుతున్నామన్న దానిపై అభిమానులు మాట్లాడుకుంటుంటే మీడియా మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. రోహిత్‌కు తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్నది పూర్తి అవాస్తవమని చెప్పారు. తమపై ఇలా ప్రతికూల ప్రచారం చాలా రోజులుగా సాగుతోందని ఆవేదన చెందారు. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను కూడా వివాదంలోకి లాగుతున్నారని వ్యాఖ్యానించారు. […]
రోహిత్ శర్మతో తనకు విభేదాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా కెప్టెన్ కోహ్లి అసహనం వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించాడు. తాము క్రికెట్ ఎంత బాగా ఆడుతున్నామన్న దానిపై అభిమానులు మాట్లాడుకుంటుంటే మీడియా మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు.
రోహిత్‌కు తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్నది పూర్తి అవాస్తవమని చెప్పారు. తమపై ఇలా ప్రతికూల ప్రచారం చాలా రోజులుగా సాగుతోందని ఆవేదన చెందారు. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను కూడా వివాదంలోకి లాగుతున్నారని వ్యాఖ్యానించారు. టీమిండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు తాము ప్రయత్నిస్తుంటే… కొందరు మాత్రం నమ్మకం కలిగించేలా అబద్దాలు ప్రచారం చేస్తూ తమను కూల్చాలని చూస్తున్నారని మండిపడ్డాడు.
టాపార్డర్ చాలా బాగుందని… మిడిల్ ఆర్డర్‌లోనే సమస్యలున్నాయని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అందుకే మిడిల్ ఆర్డర్ లో నిలకడగా ఆడే ఆటగాడి కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. టాప్ ఆర్డర్ బాగుండడం వల్ల మిడిల్ ఆర్డర్‌కు ఎక్కువగా అవకాశాలు రావడం లేదని… ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఒక ఆటగాడు విఫలమైతే ఆ ప్రదర్శన ఆధారంగానే అతడిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
తమకు కోచ్‌గా రవిశాస్త్రే కావాలని కోరుకుంటున్నామని… కానీ కోచ్ ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్ సలహా కమిటి మాత్రమేనన్నారు. కెప్టెన్‌గా ఉన్న తన అభిప్రాయాన్ని వారు కోరితే చెబుతానన్నాడు కోహ్లి.