త్రివిక్రమ్-చిరంజీవి సినిమా లేనట్టే

త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవి ప్రకటించాడు ఆమధ్య. దీంతో అప్పట్లో అదో పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. కానీ రోజులు గడిచేకొద్ది అసలు మేటర్ బయటపడింది. చిరంజీవి-త్రివిక్రమ్ మధ్య ఇప్పట్లో సినిమా వచ్చేది అనుమానమే. దీనికి ఒకరే కారణం అని చెప్పలేం. ఇద్దరూ కారణమే. ముందుగా త్రివిక్రమ్ సంగతి తీసుకుంటే.. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్నాడు. వెంకీతో సినిమాను ఇప్పటికే ప్రకటించారు. అది ప్రకటించి కూడా ఏడాది అయింది. సో.. బన్నీ సినిమా […]

Advertisement
Update:2019-07-08 15:30 IST

త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తానని స్వయంగా చిరంజీవి ప్రకటించాడు ఆమధ్య. దీంతో అప్పట్లో అదో పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. కానీ రోజులు గడిచేకొద్ది అసలు మేటర్ బయటపడింది. చిరంజీవి-త్రివిక్రమ్ మధ్య ఇప్పట్లో సినిమా వచ్చేది అనుమానమే. దీనికి ఒకరే కారణం అని చెప్పలేం. ఇద్దరూ కారణమే.

ముందుగా త్రివిక్రమ్ సంగతి తీసుకుంటే.. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్నాడు. వెంకీతో సినిమాను ఇప్పటికే ప్రకటించారు. అది ప్రకటించి కూడా ఏడాది అయింది. సో.. బన్నీ సినిమా తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీతోనే సినిమా చేయాలి. పోనీ ఆ మూవీ తర్వాతైనా చిరంజీవితో చేస్తాడనుకుంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే వచ్చే ఏడాది ఎట్టిపరిస్థితుల్లో ఎన్టీఆర్ తో సినిమా చేయాలి త్రివిక్రమ్. ఆ మేరకు ఓ బడా నిర్మాత నుంచి ఆయన అడ్వాన్స్ తీసుకున్నాడు. చిరంజీవి సినిమాకు సంబంధించి రాతకోతలేం లేవు. అడ్వాన్సులు అంతకంటే లేవు. కేవలం మాట అనుకున్నారంతే.

ఇక చిరంజీవి విషయానికొస్తే, వయసు మీద పడ్డంతో నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. సైరా సినిమాకు ఎంత టైమ్ తీసుకున్నారో చూస్తూనే ఉన్నాం. దీని తర్వాత కొరటాల శివ సినిమా చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఏడాదిగా కొరటాల వెయిటింగ్ లో ఉన్నాడు. సో.. కొరటాల సినిమా తర్వాతే త్రివిక్రమ్ కు ఛాన్స్. ఈలోగా ఎన్ని సమీకరణాలు మారిపోతాయో చూడాలి. క్రిటిక్స్ మాత్రం మరో రెండేళ్ల వరకు ఈ కాంబినేషన్ కలిసేది లేదని తెగేసి చెబుతున్నారు. అది కూడా నిజమే.

Tags:    
Advertisement

Similar News