ఫస్ట్ టైమ్ పూరీకి లాభాలు

టెంపర్ తర్వాత పూరి జగన్నాధ్ తీసిన సినిమాలేవీ క్లిక్ అవ్వలేదు. లోఫర్, ఇజం, రోగ్, మెహబూబా.. ఇలా ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. వీటిలో పూరి సొంతంగా నిర్మించిన మెహబూబా అయితే అతడికి నష్టాలు కూడా తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు పూరి తీసిన ఓ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అవుతోంది. అదే ఇస్మాట్ శంకర్. అవును… ఇస్మార్ట్ శంకర్ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తున్నారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీసిన […]

Advertisement
Update:2019-07-04 03:45 IST

టెంపర్ తర్వాత పూరి జగన్నాధ్ తీసిన సినిమాలేవీ క్లిక్ అవ్వలేదు. లోఫర్, ఇజం, రోగ్, మెహబూబా.. ఇలా ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. వీటిలో పూరి సొంతంగా నిర్మించిన మెహబూబా అయితే అతడికి నష్టాలు కూడా తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు పూరి తీసిన ఓ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ అవుతోంది. అదే ఇస్మాట్ శంకర్.

అవును… ఇస్మార్ట్ శంకర్ సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తున్నారు. 20 కోట్ల రూపాయల బడ్జెట్ లో తీసిన ఈ సినిమాను థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి 24 కోట్ల రూపాయలకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఒక్క శాటిలైట్, డిజిటల్ నుంచే ఏకంగా ఏడున్నర కోట్ల రూపాయలు వచ్చాయి. జీ తెలుగు ఛానెల్ ఇంత మొత్తానికి ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది.

అటు థియేట్రికల్ గా చూస్తే.. ఆంధ్రాకే 10 కోట్ల రేషియోలో సినిమాను అమ్మినట్టు తెలుస్తోంది. నైజాంలో ఔట్ రేట్ కు దిల్ రాజుకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. దిల్ రాజు మాత్రం ప్రస్తుతం ఈ దిశగా ఆలోచించడం లేదని తెలుస్తోంది. మరోవైపు హిందీ డబ్బింగ్ రైట్స్ ను కూడా దాదాపు 5 కోట్ల రూపాయలకు అమ్మినట్టు వినికిడి. ఇలా టేబుల్ ప్రాఫిట్ తో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ మొత్తం బిజినెస్ వెనక చార్మి మంత్రాంగం బాగా ఫలించినట్టు టాక్.

Tags:    
Advertisement

Similar News