సీఎం జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి

ఏపీ సీఎం జగన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నియామక ఉత్తర్వులను జారీ చేసింది. గత రెండేళ్లుగా ఆయన వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలను చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు.. సుదీర్ఘకాలం చేసిన ప్రజాసంకల్ప యాత్ర విశేషాలతో ‘అడుగడుగునా అంతరంగం’ పేరుతో శ్రీహరి పుస్తకాన్ని రచించారు. గత రెండు దశాబ్ధాలుగా శ్రీహరి జర్నలిజం వృత్తిలో […]

Advertisement
Update:2019-06-26 01:30 IST

ఏపీ సీఎం జగన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నియామక ఉత్తర్వులను జారీ చేసింది.

గత రెండేళ్లుగా ఆయన వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలను చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సంబంధించిన విశేషాలతో పాటు.. సుదీర్ఘకాలం చేసిన ప్రజాసంకల్ప యాత్ర విశేషాలతో ‘అడుగడుగునా అంతరంగం’ పేరుతో శ్రీహరి పుస్తకాన్ని రచించారు.

గత రెండు దశాబ్ధాలుగా శ్రీహరి జర్నలిజం వృత్తిలో ఉన్నారు. విశాఖపట్నానికి చెందిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత మీడియా రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. సాక్షి టీవీ ఇన్‌పుట్ ఎడిటర్‌గా తన సేవలను అందించారు.

Tags:    
Advertisement

Similar News