ప్రియదర్శి సినిమాపై కేటీఆర్ కామెంట్స్

కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి ఇప్పుడు ‘మల్లేశం’ సినిమాలో హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా వేడుకకు తెలంగాణ ఐ టి మినిస్టర్ కేటిఆర్ స్వయంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా చిత్రబృందానికి తన అభినందనలు తెలిపారు. ‘మల్లేశం’ సినిమా ఎంతో మానవీయంగా మరియు హృద్యంగా ఉందని ఆయన అన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం […]

Advertisement
Update:2019-06-16 07:28 IST

కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శి ఇప్పుడు ‘మల్లేశం’ సినిమాలో హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక సామాన్యుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా వేడుకకు తెలంగాణ ఐ టి మినిస్టర్ కేటిఆర్ స్వయంగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా చిత్రబృందానికి తన అభినందనలు తెలిపారు. ‘మల్లేశం’ సినిమా ఎంతో మానవీయంగా మరియు హృద్యంగా ఉందని ఆయన అన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు ఈ చిత్రం జీవం పోసింది అని చెప్పుకొచ్చారు కేటీఆర్.

నవీన ఆవిష్కరణల రూపకల్పనలో చాలా ఇబ్బందులు వస్తాయని అన్న కేటీఆర్ చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తున్నప్పటికీ, కార్మికుల సమస్యలు మాత్రం ఇంకా తీరడం లేదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మల్లేశం పాత్రలో ప్రియదర్శి చాలా బాగా నటించారని, ప్రభుత్వం నుంచి మల్లేశం సినిమాకు అన్ని విధాలుగా సహకారం లభిస్తుంది అని చెప్పిన కేటిఆర్ సినిమాటోగ్రఫీ మంత్రితో స్వయంగా మాట్లాడి ఈ సినిమాకి పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాతో చేనేత వస్త్రాలు ధరించటం మరింత పెరుగుతుందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News