రాజ్ దూత్.. ఇదొక ఆత్మ కథ
ఆర్ఎక్స్100 హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ కొద్దీ రాజ్ దూత్ అనే టైటిల్ పెట్టారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కథ నిజంగానే రాజ్ దూత్ చుట్టూ తిరుగుతుంది. నిన్న రిలీజైన టీజర్ చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమైంది. ఏదో క్రేజ్ కోసం పెట్టింది కాదని, కథ మొత్తం రాజ్ దూత్ చుట్టూనే తిరుగుతుందనే విషయాన్ని అంతా గ్రహించారు. రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘామ్ష్ ఈ సినిమాతో హీరోగా మారాడు. లక్ష్య […]
ఆర్ఎక్స్100 హిట్ అవ్వడంతో ఆ సెంటిమెంట్ కొద్దీ రాజ్ దూత్ అనే టైటిల్ పెట్టారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కథ నిజంగానే రాజ్ దూత్ చుట్టూ తిరుగుతుంది. నిన్న రిలీజైన టీజర్ చూసిన తర్వాత ఆ విషయం అందరికీ అర్థమైంది. ఏదో క్రేజ్ కోసం పెట్టింది కాదని, కథ మొత్తం రాజ్ దూత్ చుట్టూనే తిరుగుతుందనే విషయాన్ని అంతా గ్రహించారు.
రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘామ్ష్ ఈ సినిమాతో హీరోగా మారాడు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్జున్-కార్తీక్ డైరక్ట్ చేసిన ఈ సినిమాతో ప్రియాంక వర్మ హీరోయిన్ గా పరిచయమౌతోంది. సినిమాలో రాజ్ దూత్ బండికి నటుడు సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా రాబోతోందనే విషయం తెలుస్తూనే ఉంది. జేబీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే శ్రీహరి తనయుడికి ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ దక్కినట్టే.
అంతా బాగానే ఉంది కానీ, ఒకే ఒక్క విషయంలో శ్రీహరి అభిమానులు కాస్త వెలితిగా ఫీలవుతున్నారు. ఇండస్ట్రీలో అందరికీ ఆప్తుడు శ్రీహరి. మెగా కాంపౌండ్, అక్కినేని కాంపౌండ్, నందమూరి కుటుంబం అనే తేడాలేకుండా అందరూ శ్రీహరిని అభిమానిస్తారు. అటు రాజమౌళి లాంటి అగ్రశ్రేణి దర్శకులకు కూడా శ్రీహరి అంటే చాలా ఇష్టం.
అలాంటి శ్రీహరి తనయుడు హీరోగా పరిచయం అవుతున్నాడంటే, అతడి సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ఫంక్షన్ కు అతిరథ మహారధులు వస్తారని అంతా ఆశించారు. కానీ ఈవెంట్ చప్పగా సాగింది. కేవలం జీవిత రాజశేఖర్ మాత్రమే ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.