సుమలతకు కేంద్ర మంత్రి పదవి?

కర్ణాటకలో పట్టు కోసం బీజేపీ పెద్ద స్కెచ్ గీసింది. ఇందుకోసం జేడీఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు.. కాంగ్రెస్ ను కర్ణాటకలో ఎదగనీయకుండా చేసేందుకు మోడీ, షా లు భారీ ముందడుగు వేస్తున్నట్టు తెలిసింది. రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ.. తన కేబినెట్ లోకి ఆశ్చర్యకరంగా కన్నడ ఇండిపెండెంట్ ఎంపీ సమలతను తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ సారి కేంద్ర కేబినెట్ లో ప్రత్యేకించి దక్షిణాది నుంచి బీజేపీకి ఎంపీలు తగ్గిన నేపథ్యంలో కొత్త […]

Advertisement
Update:2019-05-30 08:17 IST

కర్ణాటకలో పట్టు కోసం బీజేపీ పెద్ద స్కెచ్ గీసింది. ఇందుకోసం జేడీఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు.. కాంగ్రెస్ ను కర్ణాటకలో ఎదగనీయకుండా చేసేందుకు మోడీ, షా లు భారీ ముందడుగు వేస్తున్నట్టు తెలిసింది.

రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీ.. తన కేబినెట్ లోకి ఆశ్చర్యకరంగా కన్నడ ఇండిపెండెంట్ ఎంపీ సమలతను తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ సారి కేంద్ర కేబినెట్ లో ప్రత్యేకించి దక్షిణాది నుంచి బీజేపీకి ఎంపీలు తగ్గిన నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

కర్ణాటకలో బీజేపీ మద్దతుతో గెలిచిన ఎంపీగా సుమలత రికార్డులు బద్దలు కొట్టారు. లక్షా 20వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ క్యాడర్ మొత్తం ఆమె గెలుపునకు సహకరించింది. ఏకంగా కర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకును ఓడించింది.

ఈమె కన్నడిగుల కోడలు మాత్రమే కాదు.. తెలుగింటి ఆడపడుచు. దక్షిణాదిన ఫేమస్ నటి. అందుకే ఈమెకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని మోడీ, షాలు నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రి పదవిని కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

సుమలతకు మంత్రి పదవి పై ఈ రోజు సాయంత్రం క్లారిటీ వస్తుంది. ఆమెను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడం ద్వారా దక్షిణ కర్ణాటకపై పట్టు నిలుపుకోవాలని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మోడీ, షాలు స్కెచ్ గీస్తున్నారు.
కర్ణాటకలో దక్షిణ ప్రాంతమైన హసన్, మాండ్య, మైసూర్ లో బీజేపీ బలం చాలా తక్కువ. అక్కడ అధికార జేడీఎస్ కు గట్టి పట్టు ఉంది. ఆయా జిల్లాల్లో జేడీఎస్ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో భాగంగా సుమలతకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News