ప్రపంచకప్ లో టీమిండియా ఆల్ రౌండ్ పవర్

క్రికెట్ మ్యాచ్ లో నెగ్గాలన్నా… ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలవాలన్నా… ఏ జట్టు కైనా ఆల్ రౌండర్ల బలం ఎంతో అవసరం. 1983 ప్రపంచకప్ లో.. కపిల్ దేవ్ నాయకత్వంలో భారతజట్టు విశ్వవిజేతగా నిలవడం వెనుక ఆల్ రౌండర్ల బలం ఎంతో ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం భారత్ నలుగురు ఆల్ రౌండర్లతో టైటిల్ వేటకు దిగుతోంది. విరాట్ సేన ఆల్ రౌండ్ పవర్ ఎంతో ఓసారి చూద్దాం… నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే.. […]

Advertisement
Update:2019-05-28 11:15 IST

క్రికెట్ మ్యాచ్ లో నెగ్గాలన్నా… ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలవాలన్నా… ఏ జట్టు కైనా ఆల్ రౌండర్ల బలం ఎంతో అవసరం. 1983 ప్రపంచకప్ లో.. కపిల్ దేవ్ నాయకత్వంలో భారతజట్టు విశ్వవిజేతగా నిలవడం వెనుక ఆల్ రౌండర్ల బలం ఎంతో ఉంది.

ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం భారత్ నలుగురు ఆల్ రౌండర్లతో టైటిల్ వేటకు దిగుతోంది. విరాట్ సేన ఆల్ రౌండ్ పవర్ ఎంతో ఓసారి చూద్దాం…

నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే.. భారత్ కు విశ్వవిజేతగా నిలిచిన రికార్డు ఉంది. ప్రస్తుత 2019 ప్రపంచకప్ టోర్నీలో సైతం… భారత్ హాట్ ఫేవరెట్ జట్టుగా పోటీకి దిగుతోంది.

సూపర్ పవర్ భారత్….

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టుకు పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్, పాదరసం లాంటి ఫీల్డింగ్ ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి.

అంతేకాదు…ఈ మూడు ప్రధాన అంశాలకు ..ఆల్ రౌండ్ పవర్ తోడైతే…ఆ బలం అంతాఇంతా కాదు.

ఇంగ్లండ్ వేదికగా 1983లో ముగిసిన మూడో ప్రపంచకప్ టోర్నీలో భారతజట్టు విజేతగా నిలవడం వెనుక మొహిందర్ అమర్ నాథ్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ల పవర్ ఎంతో ఉంది.

2019 ప్రపంచకప్ లోనూ అదే ఫార్ములా…

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 12వ ప్రపంచకప్ టోర్నీలో సైతం భారత్ ఆల్ రౌండర్ల పవర్ తోనే తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

ఇద్దరు స్పిన్, ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతోంది. అఫ్ స్పిన్ ఆల్ రౌండర్ కేదార్ జాదవ్, లెప్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేస్ ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్…భారత విజయాలలో ప్రధానపాత్ర వహించడానికి ఉరకలేస్తున్నారు.

సూపర్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా…

భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు ఆయువుపట్టు లాంటి ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 45 మ్యాచ్ ల్లో 700కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, 19 క్యాచ్ లు , 44 వికెట్లు సైతం ఉన్నాయి.

గత రెండేళ్లలో పాండ్యా ఆడిన 38 వన్డేల్లో 571 పరుగులు, 35 వికెట్లు సాధించడం ద్వారా… ప్రపంచకప్ కు పూర్తిస్థాయిలో సిద్దమయ్యాడు.

స్పిన్ ఆల్ రౌండ్ జాదూ జడేజా…

భారత స్పిన్ బౌలింగ్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రం రవీంద్ర జడేజా. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన మొత్తం 151 వన్డేల్లో జడేజా 2035 పరుగులు, 174 వికెట్లు సాధించాడు.

అంతేకాదు…ప్రపంచకప్ లో 8 మ్యాచ్ లు ఆడి.. 57 పరుగులు, 9 వికెట్లు సాధించాడు.

ఇక…గత రెండేళ్లలో ఆడిన 22 వన్డేల్లో జడేజా 147 పరుగులు సాధించడంతో పాటు…, 23 వికెట్లు సైతం పడగొట్టాడు.

ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ కేదార్ జాదవ్….

భారత మిడిలార్డర్లో వీరబాదుడు బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకొన్న కేదార్ జాదవ్ కు విచిత్రమైన యాక్షన్ తో ఆఫ్ స్పిన్ బౌలర్ గా.. కీలక వికెట్లు పడగొట్టడంలో మొనగాడిగా పేరుంది.

తన కెరియర్ లో తొలిసారిగా ప్రపంచకప్ కు ఎంపికైన కేదార్ జాదవ్.. 59 వన్డేల్లో 1174 పరుగులు, 27 వికెట్లు సాధించిన రికార్డు ఉంది. ఇందులో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

గత రెండేళ్లలో కేదార్ జాదవ్ ఆడిన 44 వన్డేల్లో 706 పరుగులు, 21 వికెట్లు పడగొట్టడం విశేషం.

విజయ్ శంకర్ కు భలే చాన్స్…

కేవలం తొమ్మిది వన్డేలు ఆడిన అనుభవంతోనే ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించాడు పేస్ ఆల్ రౌండర్ విజయ్ శంకర్.

ఆరడుగుల విజయ్ శంకర్ ఇప్పటి వరకూ ఆడిన 9 వన్డేల్లో 165 పరుగులు, 2 వికెట్లు మాత్రమే సాధించాడు.

ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులోని నాలుగో నంబర్ స్థానం కోసం రాహుల్, కేదార్ జాదవ్ లాంటి ఆటగాళ్లతో విజయ్ శంకర్ పోటీపడుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News