హిట్స్ లేకపోయినా రేటు తగ్గలేదు
సూర్యకు తెలుగులో కాస్తోకూస్తో పాపులారిటీ ఉంది. కానీ అతడు నటించిన సినిమాలేవీ ఈమధ్య ఇక్కడ హిట్ అయిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో అతడి నెక్ట్స్ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగకపోవచ్చంటూ ఊహాగానాలు చెలరేగాయి. కానీ సూర్య మాత్రం మరోసారి మెరిశాడు. ఈ హీరో నటించిన ఎన్ జీ కే సినిమా తెలుగులో మంచి రేటుకు అమ్ముడుపోయింది. నిర్మాత కేకే రాధామోహన్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. ఈమధ్య […]
Advertisement
సూర్యకు తెలుగులో కాస్తోకూస్తో పాపులారిటీ ఉంది. కానీ అతడు నటించిన సినిమాలేవీ ఈమధ్య ఇక్కడ హిట్ అయిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో అతడి నెక్ట్స్ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగకపోవచ్చంటూ ఊహాగానాలు చెలరేగాయి. కానీ సూర్య మాత్రం మరోసారి మెరిశాడు.
ఈ హీరో నటించిన ఎన్ జీ కే సినిమా తెలుగులో మంచి రేటుకు అమ్ముడుపోయింది. నిర్మాత కేకే రాధామోహన్ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 8 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాడు. ఈమధ్య ఫ్లాపులిచ్చినా ఎన్ జీ కేకు మంచి రేటు రావడానికి హీరోయిన్లే కారణం.
అవును.. ఈ సినిమాలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరికీ తెలుగులో క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకు 8 కోట్ల ఆఫర్ వచ్చింది. పైగా తెలుగులో కూడా ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చుల్ని అసలు నిర్మాత ప్రభు పెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. దీంతో డీల్ ఈజీగా సెట్ అయిపోయింది.
ఈనెల 31న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అప్పటికే మహర్షి మేనియా పూర్తవుతుంది. మధ్యలో మరో పెద్ద సినిమా లేదు. కాబట్టి ఎన్ జీ కేకు వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి.
Advertisement