ఏకథాటిగా 30 గంటలైనా ఓకే
తమకు ఎంత స్టామినా ఉందో చెప్పుకోవడానికి హీరోయిన్లు తెగ తాపత్రయపడుతుంటారు. మొన్నటికి మొన్న పూజా హెగ్డే ఇలాంటి ప్రకటన చేసింది. తను రోజుకు 3 షిఫ్టులు పనిచేస్తానని.. పొద్దున్న ఎన్టీఆర్, మధ్యాహ్నం మహేష్, సాయంత్రం ప్రభాస్ తో ఏకథాటిగా వర్క్ చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రకుల్ ప్రీత్ కూడా చేరిపోయింది. తను ఏకథాటిగా 30 గంటలు పనిచేయగనని చెప్పుకొచ్చింది. “పని చేయడం నాకిష్టం. చేతినిండా పని ఉంటే నాకు నిద్ర కూడా […]
తమకు ఎంత స్టామినా ఉందో చెప్పుకోవడానికి హీరోయిన్లు తెగ తాపత్రయపడుతుంటారు. మొన్నటికి మొన్న పూజా హెగ్డే ఇలాంటి ప్రకటన చేసింది. తను రోజుకు 3 షిఫ్టులు పనిచేస్తానని.. పొద్దున్న ఎన్టీఆర్, మధ్యాహ్నం మహేష్, సాయంత్రం ప్రభాస్ తో ఏకథాటిగా వర్క్ చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రకుల్ ప్రీత్ కూడా చేరిపోయింది. తను ఏకథాటిగా 30 గంటలు పనిచేయగనని చెప్పుకొచ్చింది.
“పని చేయడం నాకిష్టం. చేతినిండా పని ఉంటే నాకు నిద్ర కూడా పట్టదు. ఏకథాటిగా 30 గంటల పాటు నేను పనిచేయగలను. మరీ ముఖ్యంగా టాలెంట్ ఉన్న వ్యక్తులతో పనిచేయాలనుకుంటాను. వాళ్లు కూడా నాలానే పనిచేయాలని కోరుకుంటాను. నా పనికి గుర్తింపు ఆశిస్తాను. అప్పుడు మాత్రమే ఇంకాస్త ఎక్కువ పనిచేయగలం.”
శారీరకంగా, మానసికంగా తను చాలా దృఢంగా ఉంటానని, సెట్స్ లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా షూటింగ్ చేస్తానని అంటోంది రకుల్. మరోవైపు సోషల్ మీడియాలో తనపై చెలరేగుతున్న విమర్శల్ని ఎదుర్కోవడానికి మానసికంగా కూడా దృఢంగా ఉంటానని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తెలుగు, హిందీ సినీ పరిశ్రమల మధ్య తీరక లేకుండా చక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ, తనకు ఇదేదీ కష్టం అనిపించదని అంటోంది. ఒక్కోసారి నిద్రలేకుండా కూడా పనిచేసిన సందర్భాలున్నాయని గుర్తుచేస్తోంది రకుల్.