డాక్టర్ కాబోయి.... యాక్టర్ అయిందట!

ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్న చేతిలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి. ఒకవైపు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ మిల్కీ బ్యూటీ. త్వరలో ఈమె ‘క్వీన్’ తెలుగు రీమేక్ అయిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి తదుపరి భారీ […]

Advertisement
Update:2019-05-06 04:25 IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోయిన్లలో తమన్నా పేరు ముందు ఉంటుంది. ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమన్న చేతిలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి.

ఒకవైపు తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఈ మిల్కీ బ్యూటీ. త్వరలో ఈమె ‘క్వీన్’ తెలుగు రీమేక్ అయిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అంతేకాక మెగాస్టార్ చిరంజీవి తదుపరి భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాక ‘అభినేత్రి’ సినిమా సీక్వెల్ అయిన ‘అభినేత్రి 2’ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె వరుస షూటింగ్ లతో బిజీబిజీగా ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఒకవేళ నటిని కాకపోయుంటే తన జీవితం ఎలా ఉండేదో బయట పెట్టింది తమన్నా. “ఒకవేళ సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే కచ్చితంగా మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యుండేదాన్ని” అని చెబుతోంది. కుటుంబంలో ఇప్పటికే చాలామందికి మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వలన తాను కూడా డాక్టర్ వృత్తిని ఎంచుకునే దాన్ని అని చెప్పుకొచ్చింది తమన్నా.

మొత్తానికి డాక్టర్ అవబోయి ఇలా యాక్టర్ గా మారిందన్నమాట. నిజజీవితంలో డాక్టర్ కాలేకపోయినప్పటికీ తమన్నా ‘ధర్మాదురై’ అనే తమిళ సినిమాలో డాక్టర్ గా కనిపించింది.

Tags:    
Advertisement

Similar News