షష్టిపూర్తి మన్మథుడు బాగున్నాడు.. కానీ..!

సోలో హీరోగా నాగార్జున మార్కెట్ పడిపోయి చాలా రోజులైంది. కుర్రహీరోలకు వచ్చినంతగా కూడా ఓపెనింగ్ లు రావడంలేదు. దీనికి కారణం కొంతకాలంగా నాగార్జున ఎంచుకుంటున్న సబ్జెక్ట్ లే కావొచ్చు. సోగ్గాడే చిన్నినాయనా మినహా ఈమధ్య కాలంలో నాగార్జునకు చెప్పుకోదగ్గ విజయమేదీ లేదు. తాజాగా మన్మథుడు-2 స్టార్ట్ చేశాడు. షష్టిపూర్తి వయసులో మన్మథుడు ఏంటి అని అందరూ అనుకుంటున్నా.. పట్టుబట్టి నాగార్జున ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన స్టిల్స్ చూస్తుంటే సినిమా విషయంలో ఆయన […]

Advertisement
Update:2019-04-27 08:24 IST

సోలో హీరోగా నాగార్జున మార్కెట్ పడిపోయి చాలా రోజులైంది. కుర్రహీరోలకు వచ్చినంతగా కూడా ఓపెనింగ్ లు రావడంలేదు. దీనికి కారణం కొంతకాలంగా నాగార్జున ఎంచుకుంటున్న సబ్జెక్ట్ లే కావొచ్చు. సోగ్గాడే చిన్నినాయనా మినహా ఈమధ్య కాలంలో నాగార్జునకు చెప్పుకోదగ్గ విజయమేదీ లేదు. తాజాగా మన్మథుడు-2 స్టార్ట్ చేశాడు.

షష్టిపూర్తి వయసులో మన్మథుడు ఏంటి అని అందరూ అనుకుంటున్నా.. పట్టుబట్టి నాగార్జున ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన స్టిల్స్ చూస్తుంటే సినిమా విషయంలో ఆయన ఎంత కేర్ తీసుకున్నాడనేది అర్థమవుతోంది. సినిమా కంటే తన మేకప్, మేకోవర్ విషయంలో మాత్రం బాగానే కష్టపడ్డారని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో నాగార్జునని చూసినవారెవరికైనా ఈ సినిమా స్టిల్స్ చూస్తే ఇది మేకప్ మాయాజాలం అని ఈజీగా అర్థమవుతుంది.

ఏడాది క్రితం ఆఫీసర్ సినిమాతో నాగార్జున అప్పియరెన్స్ ని ఎంత డ్యామేజీ చేయాలో అంతా చేసేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ దెబ్బతో తన అప్పియరెన్స్ పై నాగ్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. అందుకే మన్మథుడు-2 ఔట్ పుట్ ఇంత క్లారిటీగా ఉందని సినీ వర్గాలంటున్నాయి. స్టిల్స్ వరకు ఓకే, ఇక సినిమా సంగతేంటో చూడాలి.

ఓ వైపు యంగ్ జనరేషన్ దూసుకొస్తుంటే.. నాగార్జున లాంటి సీనియర్ హీరో సినిమాకి స్కోప్ దక్కడం కాస్త కష్టమే. అందులోనూ మరోసారి పక్కా క్లాస్ సబ్జెక్ట్ తో రెడీ అయ్యారు. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం నాగ్ చాలా అప్డేట్ అయినట్టు కనిపిస్తోంది. జిమ్ చేస్తున్న వీడియోల దగ్గర్నుంచి, స్టిల్స్ వరకు.. ప్రతీదీ సోషల్ మీడియాలో వదుల్తూ సినిమాపై క్రేజ్ తీసుకొస్తున్నారు. మొత్తమ్మీద నాగార్జున ఈసారి హిట్ కోసం కసిగా ఎదురు చూస్తున్నట్టు అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News