దర్శకుడి అవతారమెత్తిన మోహన్ లాల్
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేయగల మోహన్ లాల్ కేవలం మలయాళం లోనే కాక తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు. అయితే నటుడిగా తన సత్తా ఇప్పటికే చాలాసార్లు చాటుకున్న మోహన్ లాల్ ఇప్పుడు దర్శకుడి గా మారనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోహన్ లాల్ ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక […]
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేయగల మోహన్ లాల్ కేవలం మలయాళం లోనే కాక తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.
అయితే నటుడిగా తన సత్తా ఇప్పటికే చాలాసార్లు చాటుకున్న మోహన్ లాల్ ఇప్పుడు దర్శకుడి గా మారనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోహన్ లాల్ ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ చిత్రమని సమాచారం.
‘బర్రోజ్: గార్డియాన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ సినిమా మొత్తం త్రీడీలో ఉండబోతోంది.
‘మై డియర్ కుట్టిచాటాన్’ అనే మలయాళం సినిమా కి దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ దర్శకుడిగా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించనున్నారో చూడాలి.